Wednesday, April 24, 2024
- Advertisement -

గ్రేటర్ లో బిజేపీ గెలుస్తుందా.. పక్కా వ్యూహాలు..?

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ చూపిస్తున్న దూకుడు చూస్తుంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి అధికార ప్రభుత్వాలకి కొంత తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తుంది.. ఆంధ్ర సంగతి ఏమో కానీ తెలంగాణ లో కేసీఆర్ కి మంచి పోటీ బీజేపీ ఇవ్వనుందని తెలుస్తుంది.. ఇప్పటికే పంటికింద రాయిలా అన్ని వ్యవహారాల్లో తలదూరుస్తూ కేసీఆర్ తలనొప్పిని తీస్తుండగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుని తాము కూఆ స్ట్రీమ్ లైన్ లో ఉన్నట్లు బీజేపీ చెప్పకనే చెప్పింది.. ముఖ్యంగా కేంద్రమంత్రి అయ్యాక కిషన్ రెడ్డి, అధ్యక్షుడు అయ్యాక బండి సంజయ్ మరో గేర్ వేసి అధికార ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నట్లు వారి కార్యక్రమాల ద్వారా అర్థమవుతుంది.

ఇక వారి ఫోకస్ అంతా ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలపై ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ అధ్యక్షుడు గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతుండడంతో బండి సంజయ్ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. గ్రేటర్ మేయర్ పీఠాన్ని దక్కించుకుని అధికార పార్టీకి సవాల్ విసరాలని యోచిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటి భవిష్యత్ లో పార్టీకి ఎదురు లేకుండా చేయడంతో పాటు, కాంగ్రెస్ ను వెనక్కు నెట్టాలన్నది బండి సంజయ్ ఆలోచనగా ఉంది.

కాంగ్రెస్ బలహీనతను, టీఆరెస్ పై వస్తున్న విమర్శలను తమకు బలంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తుండగా అక్కడి అభ్యర్థుల ఎంపిక విషయంలో కొత్త రూట్లో వెళ్తుంది. సర్వే చేయించి ఎవరికైతే ఎక్కువ ప్రజల ఆదరాభిమానాలు ఉన్నాయి వారికే టికెట్ ఇవ్వాలని సూచించిందట.. అలాగే గ్రేటర్ ఎన్నికల సమయంలో పాదయాత్ర చేసి ప్రజల్లోకి పార్టీ దూసుకుపోయేలా ప్రణాళికలు వేశారట.. ఇందుకోసం వార్డుల వారీగా రూట్ మ్యాప్ ను సిద్ధం చేయాలని నేతలను బండి సంజయ్ ఆదేశించారు. పార్లమెంటు సమావేశాల తర్వాత బండి సంజయ్ హైదరాబాద్ లో పాదయాత్ర చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు. ఇంకా ఇప్పటివరకు పనిచేసిన కార్పొరేటర్ల అవినీతిని చెప్తూ తమ పార్టీ ని ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నారట.. ఇప్పటికే బండి సంజయ్ డివిజన్ స్థాయిలో పార్టీని ప్రక్షాళన చేస్తున్నారు. మొత్తం మీద బండి సంజయ్ వ్యూహాలు గ్రేటర్ ఎన్నికల్లో ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.

జగన్ ను హెచ్చరిస్తున్న తెలంగాణ ఎంపీ.. ఎందుకంటే..?

తెలంగాణలో ఎమ్మెల్సీ సీట్లపై బీజేపీ గురి.. ?

తెలంగాణ సర్కార్‌ను నిలదీసిన హైకోర్టు…

మీ విధానాలు అన్ని రాష్ట్రాలకి ఆదర్శం.. జగన్ పై మోడీ ప్రశంసలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -