Friday, April 19, 2024
- Advertisement -

కెసిఆర్ ప్రభుత్వం కూల్చడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుందా..?

- Advertisement -

దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అన్ని రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.. నార్త్ లో చాలా వరకు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది.. అంతేకాదు ఎంతో బలంగా కూడా ఉంది.. పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ అక్కడ అధికారంలోకి రావడం ఖాయమనిపిస్తుంది..దక్షిణాది లో మాత్రం అధికారంలోకి రావడం అంత వీజీ కాదు.. కొన్ని చోట్ల బీజేపీ పార్టీ అంటే ఏంటో అన్నట్లు ప్రజలు ఆలోచిస్తున్నారు.. ఎటొచ్చి ప్రాంతీయ పార్టీ ల తోనే బీజేపీ కి కొంత తలనొప్పి వ్యవహారం నెలకొంది..  ప్రాంతీయ పార్టీ ల హవా తో బీజేపీ లాంటి నేషనల్ పార్టీ లు కనుమరుగైపోయాయని చెప్పొచ్చు..

తెలుగు రాష్ట్రాలలో బీజేపీ మళ్ళీ పుంజుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తుందని చెప్పొచ్చు.. ముఖ్యంగా తెలంగాణ లో ఇప్పటికే కొంత బలం పుంజుకుందని చెప్పొచ్చు.. నాలుగు ఎంపీ సీట్లు గెల్చుకోవడంతో బీజేపీ పార్టీ తెలంగాణ లో ప్రత్యామ్నాయ పార్టీ గా ఎదిగింది. బీజేపీ పార్టీ ని సైతం ప్రజలు నమ్మడం మొదలుపెట్టారని తెలిసిపోతుంది.. ఇక నాలుగు ఎంపీ సీట్లు గెలిచినా ఉత్సాహం తో బీజేపీ తెలంగాణ లో అన్ని రకాలా ఆందోళనలు చేయడానికి పుంజుకుంటుంది. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చూపిస్తున్న దూకుడు అందరు చూస్తూనే ఉన్నారు..

తాజాగా తెలంగాణ లో ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచనలో బీజేపీ పార్టీ ఉందని సాక్షాత్ కేసీఆర్ సైతం చెప్పడం వారి రాజకీయం ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు.. కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీ కొత్త తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్‌ను జైలుకు పంపించే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆయన ఆషామాషీగా చేయడం లేదన్న రూఢీ సమాచారం కేసీఆర్‌కు అందినట్లుగా భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రాజెక్టుల గురించి కేంద్రం ఆరా తీస్తోంది. అయిన ఖర్చు ఇతర అంశాలపై వివరాలు అడుగుతోంది. కేసీఆర్ దోచుకున్నదంతా లెక్కలతో సహా బయటపెడతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో కేసీఆర్ .. ప్రభుత్వాన్ని కూలదోసే బీజేపీ రాజకీయాలపై మాట్లాడటం.. ఖచ్చితంగా ఏదో ఉందన్న సంకేతాన్ని పంపడమేనని అంచనా వేస్తున్నారు.

ఛీ. పొమ్మన్న చంద్రబాబు బీజేపీ చెంతకే వెళ్తున్నాడంటే.?

దుబ్బాక లో హరీష్ టీఆర్ఎస్ జైత్ర యాత్ర కొనసాగించేనా..?

అయోమయంలో టీడీపీ ఇన్ ఛార్జ్ లు…

గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -