Tuesday, April 23, 2024
- Advertisement -

ఆప‌రేష‌న్ ద్ర‌విడ అవాస్త‌వం…భాజాపా

- Advertisement -

దక్షిణ భారతదేశాన్ని కబళించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని… ఏపీ, తెలంగాణల్లో పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఆపరేషన్ ద్రవిడను చేపట్టిందంటూ హీరో శివాజీ నిన్న సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రాంతీయ‌పార్టీల‌ను నిర్వీర్యం చేసి అధికారాన్ని త‌మ చేతిలో పెట్టుకోవాల‌ని చూస్తోంద‌ని ఆరోప‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే శివాజీ వ్యాఖ్య‌ల‌ను భాజాపా ఖండించింది. ఆపరేషన్ గరుడ, ద్రవిడ అనేవి అవాస్తవాలని… ఓ ఫ్లాప్ హీరో ఊహాజనిత కథనాలని బీజేపీ అధికార ప్రతినిధి సుధీశ్ రాంభొట్ల అన్నారు. టీడీపీ నేతలు ఇటీవలి కాలంలో ‘కుట్ర’ అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వైసీీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక పార్లమెంటు సభ్యుడని… ప్రధాని కార్యాలయంలో ఆయన తిరిగితే తప్పేంటని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదాను ఏ రాష్ట్రానికీ పొడిగించలేదని చెప్పారు. ఆరు రాష్ట్రాలను ప్రత్యేక నిధులను మాత్రమే విడుదల చేశామని తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఏపీకే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ నిధులను ఇచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదనన్న ఆరోపణలు కూడా అవాస్తవాలని సుధీశ్ రాంభొట్ల అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసిన పట్టిసీమ ప్రాజెక్టు చాలా గొప్పదని… అయితే, ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందనేది మాత్రం వాస్తవమని తెలిపారు. మ‌రి టీడీపీ నేత‌లు సుధీష్ వ్యాఖ్య‌ల‌కు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -