Friday, April 26, 2024
- Advertisement -

ఏపీలో పవన్, బాబుతో కలిసి.. బీజేపీ స్కెచ్ ఇదేనట..

- Advertisement -

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీతో సాన్నిహిత్యంగా ఉంటుందన్న ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఏపీ బీజేపీ నేతలు మాత్రం సీఎం వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఓడిపోయాక చంద్రబాబు బీజేపీపై పల్లెత్తు మాట అనడం లేదు. బీజేపీ పెద్దలను విమర్శించడం లేదు. ఈ లెక్కలన్నీ వేసుకున్నాక ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్లు బీజేపీతో దోస్తీకి టీడీపీ ప్రయత్నిస్తుందన్న మాటే. ఇక పవన్ కూడా మాట ఎత్తితే వైసీపీపై కేంద్రంలోని మోడీషాకు ఫిర్యాదు చేస్తానని చెబుతున్నాడు..

దీన్ని బట్టి కేంద్రంలోని అధికార బీజేపీకి టీడీపీ, జనసేన దగ్గరవుతున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు , బీజేపీ సనేత అన్నం సతీష్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ-టీడీపీ దోస్తీపై క్లారిటీ ఇచ్చాయి. బీజేపీ భవిష్యత్ వ్యూహంపై వీరు చూచాయగా చెప్పుకొచ్చారు.

తాజాగా మూడేళ్లలోనే ఎన్నికలు వస్తాయని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చెప్పడం సంచలనంగా మారింది. దీన్ని బట్టి వచ్చే మూడేళ్లలోనే వైసీపీ ప్రభుత్వం పడిపోతుందని.. బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నికలు వెళుతుందనే మాట వినిపిస్తోంది. అదే సమయంలో ఏపీలో జనసేన, టీడీపీతో బీజేపీ కలిసి పోటీచేస్తుందన్న వాదన కూడా అయ్యన్నపాత్రుడు చూచాయగా చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీని ఓడించడానికి అవసరమైతే బీజేపీ, జనసేనతో బాబు కలవడానికి వెనుకాడరని అయ్యన్న వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక డిసెంబర్ లోగా జనసేన పార్టీ బీజేపీలో కలిసిపోతుందని బీజేపీ నేత అన్న సతీష్ మాట్లాడడం కూడా ఈ వ్యాఖ్యలకు బలం చేకూరుతోంది. పవన్ ను సీఎంగా చూడాలని ఉందని.. అందుకే తమ బీజేపీ సీఎం క్యాండిడేట్ గా పవన్ ఉంటే పార్టీ నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ జమిలి ఎన్నికలు వెళితే ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేసే అవకాశాలున్నాయని అర్థమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -