Tuesday, April 16, 2024
- Advertisement -

తెలంగాణా, ఎపిలో బిజెపి స్టడీ….. 2019 ఎన్నికల ఫలితాలు ఏంటంటే?

- Advertisement -

రాజకీయ నాయకులందరూ కూడా ఇప్పుడు సర్వేలు, స్డడీలపైన పడ్డారు. వాళ్ళ వాళ్ళ సొంత సర్వేల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని తేలితే ఆ పార్టీలోకి జంపింగ్స్ కొడుతున్నారు. అలాగే జాతీయస్థాయి పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకూ అన్నీ కూడా తెలుగు నాట సర్వేలు, స్టడీలను జోరుగా చేస్తున్నాయి. రీసెంట్‌గా టిడిపి చేసిన స్టడీలో ఆంధ్రప్రదేశ్ నాట యాభై మంది టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఓటమి తప్పదన్న విషయం తేలింది. ఆ వెంటనే చంద్రబాబు టిడిపి పార్టీ మీటింగ్ పెట్టి సిట్టింగ్‌లందరికీ సీట్లిస్తాను అని అనుకుంటే పొరపాటే అని…….. గెలిచే అవకాశం ఉన్నవారికే ఇస్తానని……. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని తన పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరించాడు.

ఇప్పుడు బిజెపి కూడా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక స్టడీ నిర్వహించింది. తెలంగాణాలో కెసీఆర్‌పై కూడా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని ఆ స్టడీ చెప్తోంది. మరీ టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్న స్థాయిలో ఒన్ సైడ్ ఎన్నికలకు ఛాన్సేలేదని…..కెసీఆర్ పార్టీకి కూడా కనాకష్టంగానే ఉంటుందని ఆ స్టడీ తేల్చింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టిడిపి ఓటమి ఖాయం అని తేల్చేసింది బిజెపి స్టడీ. తెలుగు దేశం పార్టీపైన ప్రజల్లో తీవ్రస్థాయి వ్యతిరేకత ఉందని……కేవలం 30 నుంచి 40 సీట్లకు టిడిపి పరిమితం అయ్యే అవకాశం ఉందని బిజెపి స్టడీ తేల్చేసింది. జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రజల్లో వైకాపాకు పూర్తి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేలా చేసిందని బిజెపి స్టడీ చెప్తోంది. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదన్న భావనలో ప్రజలు ఉన్నారు. మోడీ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసంతృప్తితోనే ఉన్నారు. ఆ నేపథ్యంలోనే జాతీయ పార్టీలతో పాటు టిడిపి కూడా పూర్తిగా మునిగిపోవడం ఖాయమని……..వైకాపా స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుందని బిజెపి స్టడీ తేల్చిచెప్తోంద.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -