బీజేపీతో కలిసి పని చేస్తాం.. : పవన్ కళ్యాణ్

1513
BJP ties up with Pawan Kalyan's Janasena Party in Andhra Pradesh
BJP ties up with Pawan Kalyan's Janasena Party in Andhra Pradesh

విజయవాడలో బీజేపీ నేతలతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల కోసం బీజేపీతో చేతులు కలిపామని అన్నారు. మోదీని ఇష్టపడేవారు, జనసేన భావజాలాన్ని మెచ్చినవారంతా ఒక గూటికిందకు వచ్చామని అన్నారు.

జనసేన, బీజేపీ భావజాలం ఒకేటనని.. అందుకే బీజేపీతో కలిసి పని చేస్తామని.. 2024లో ఏపీలో బీజేపీ, జనసేనల ప్రభుత్వం ఏర్పడుతుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలతో ప్రజలు విసిగిపోయారని.. ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం పాలెగాళ్ల ప్రభుత్వం నడుస్తోందని ఏపీ భవిష్యత్తు కోసం బీజేపీతో కలిసి ముందుకు వస్తున్నామని.. రాజధాని రైతులను వైసీపీ ప్రమాదంలోకి తోసేసిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అభీష్టం మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పని చేస్తామని చెప్పారు. రెండు పార్టీల మధ్య అవగాహన కోసం కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేస్తామని పవన్ వెల్లడించారు. స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని చెప్పారు.

Loading...