పూనె లోక్‌స‌భ స్థానంనుంచి భాజాపా త‌రుపున ఎంపీగా బ‌రిలో దిగుతున్న బాలీవుడ్ బ్యూటీ

386
Bollywood actress Madhuri Dixit In BJP's Shortlist To Contest From Pune In 2019 Election
Bollywood actress Madhuri Dixit In BJP's Shortlist To Contest From Pune In 2019 Election

ప్ర‌స్తుతం ఎన్నిక‌ల్లో అన్ని పార్టీల‌కు సినీ గ్లామ‌ర్ అవ‌స‌రం పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకీ ఉన్న సినీ గ్లామ‌ర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. 2019లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. దానిలో భాగంగా భాజాపా కూడా సినీ గ్లామ‌ర్ పై దృష్టి సారించింది.వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ త‌రుపునుంచి బాలీవుడ్ స్టార్లను రంగంలోకి దించనుంది.

పూణె లోక్ సభ స్థానం నుంచి మాధురీ దీక్షిత్ ను బరిలోకి దింపనున్నట్టు పార్టీ శ్రేణులు తెలిపాయి. జూన్ నెలలో ముంబైలోని మాధురీ నివాసానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతలను ఆమెకు వివరించారు.

పూణే లోక్‌సభ స్థానానికి చేసిన షార్ట్‌లిస్ట్‌లో మాధురీ దీక్షిత్ పేరు ఉన్నట్లు తెలిపారు మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత ఒక‌రు. 2019 ఎన్నికల్లో ఆమెను పోటీలోకి దించే విషయంలో పార్టీ చాలా సీరియస్‌గా ఉందన్నారు. మాధురీ దీక్షిత్‌కు ఇదే మంచి అవకాశంగా తాము భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.