జగన్ సర్కార్ కొత్త నిర్ణయం.. కరోనా రోగి వద్ద కాలింగ్‌ బెల్‌.. !

749
calling Bell Facility For Corona Patients In Andhra Pradesh Hospitals
calling Bell Facility For Corona Patients In Andhra Pradesh Hospitals

ఏపీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఎక్కువ పరీక్షలు చేస్తుండటంతో కేసులు సంఖ్య కూడా ఎక్కువగా వస్తున్నాయి. మరణాలు కూడా ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. అయితే కరోనా రోగుల కోసం కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది జగన్ సర్కార్.

ఆసుపత్రిల్లో కరోనా చికిత్స పొందుతున్నవారి బెడ్‍ల వద్ద కాలింగ్ బెల్స్ ఏర్పటు చేయనున్నారు. ఆస్పత్రుల్లో వైద్యులు తరచూ రౌండ్స్‌కు వెళ్లడం లేదన్న విమర్శలు ఇటీవలే ఎక్కువ అయ్యాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అవసరమైనప్పుడు రోగి బెల్‌ నొక్కితే చాలు.. నర్సు లేదా డాక్టర్‌ వచ్చి పేషెంట్‌ పరిస్థితి తెలుసుకునే వీలుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్‌లకు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ఐసీయూ, నాన్‌ ఐసీయూ, ఆక్సిజన్, జనరల్‌ వార్డుల్లో ఈ బెల్స్‌ ఏర్పాటు చేసి, రిసెప్షన్‌ చాంబర్‌తో అనుసంధానం చేస్తారు. ఒక్కసారి బజర్‌ నొక్కగానే వార్డులో గంట మోగడంతో పాటు లైట్లు కూడా వెలుగుతాయి. డాక్టర్‌, నర్సు ఎవరు అందుబాటులో ఉంటే వారు వెళ్లి రోగి సమస్యను పరిక్షిస్తారు. ఇలా చేయడం వల్ల ఎమర్జెన్సీ సేవలు అవసరమయ్యే రోగులను వెంటనే గుర్తించొచ్చు. ఇప్పటికే రోగులకు అందుతున్న సేవల పరిశీలనకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే ఇబ్బందులు తప్పుతాయని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకుంది.

బాలయ్య, పవన్ చేస్తే తప్పు లేదు.. నేను చేస్తే తప్పా ? : ఎమ్మెల్యే…

చంద్రబాబు, లోకేశ్ కు షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీలు.. ?

టీడీపీకి అమరావతి.. వైసీపీకి విశాఖ.. మరి జనసేనకు ?

టీడీపీ వేర్లు కూడా పీకేసిన జగన్.. సరికొత్త చరిత్రను లిఖించాడు..!

Loading...