Friday, April 19, 2024
- Advertisement -

ప‌వ‌న్ ఏదో అనుకుంటే.. ఇంకేదో అవుతుంది

- Advertisement -

ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి అభ్య‌ర్థులు లేక జ‌న‌సేన పార్టీ ఇబ్బందులు ప‌డుతోంది. ఇప్పుడిప్పుడే రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకునేందుకు ఆ పార్టీ ప్ర‌య‌త్నిస్తుంది. ఈ స‌మ‌యంలోనే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకుంటున్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు అంటూ ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కూడా మొదలైంది. దరఖాస్తులను తీసుకుని.. వడపోసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

ఇక్క‌డి వ‌ర‌కు అంతా బానే ఉంది. కానీ ఇది అమ‌ల్లోకి వ‌స్తుందా అనేదే పెద్ద డౌట్‌గా ఉంది. ద‌ర‌ఖాస్తు అన‌గానే ఎవ్వ‌రైనా పోటీ చేయ‌డానికి సిద్ధంగా ఉంటారు. మ‌రి ప‌వ‌న్ ఎవ‌రిని ఎన్నుకుంటారు. అస‌లు పోటీ చేయ‌డానికి అర్హ‌త ఏంటీ అన్న‌ది మాత్రం క్లారిటీ లేదు. పోనీ ఈ అంశాన్ని రాజకీయంగా ఎంత వరకూ పనికి వస్తుందనేది కూడా అనుమానంగానే ఉంది. ఎందుకంటే నియోజకవర్గ స్థాయి నేత‌ల‌ను నియమించి అభ్యర్థులను ఎంచుకుంటేనే.. అమీతుమీ తేల్చుకోవడం కష్టం. అలాంటిది ఇలా దరఖాస్తులు అంటే అస‌లు ఏమాత్రం వ‌ర్క‌వుట్ అయ్యే అంశం కాద‌నేని విశ్లేష‌కుల మాట‌.

ఇప్పటికే జ‌న‌సేన‌లో చేరిన‌వారంతా ఎవ‌రి ఖర్చులు వారే పెట్టుకొంటు ఉన్నారు. అలాంటి వారు కూడా టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. మరి వారి దరఖాస్తులను తిరస్కరించేంత శక్తి .. ఈ కమిటీకి ఉంటుందా? అనేది కూడా సందేహమే. ఎందుకంటే కొత్త‌గా వ‌చ్చే వారి ఖ‌ర్చుల‌ను భ‌రించే శ‌క్తి జ‌న‌సేన‌కు ఉందా?

ఇక పార్టీ టికెట్ ఆశించి నిరాశ చెందిన వారు పార్టీకి విధేయులుగా ఉంటారా? అంటే లేద‌నె చెప్పుకోవాలి. ఎందుకంటే గ‌తంలో ప్ర‌జారాజ్యాన్ని స్థాపించిన‌పుడు చాలా మంది చిరంజీవిని ఆశానికెత్తి టికెట్ ఆశించారు. కానీ టికెట్ ద‌క్క‌క‌పోయేస‌రికి పార్టీకి దూరంగా ఉండ‌టమే కాదు.. వ్య‌తిరేకంగా కూడా ప‌నిచేశారు. మ‌రి ప‌వ‌న్ వీటిని ఎలా ఎదుర్కోంటార‌ని వేచి చూడాల్సిందే. మరి జ‌న‌సేన రూపొందించిన ఈ ద‌రఖాస్తుల కథ ఎక్క‌డి వ‌ర‌కు వెళ్తుందో మ‌రి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -