బ్రేకింగ్…….మరాఠా కేంద్రమంత్రికి సాగిలపడ్డ బాబు….జాతీయ మీడియా

577
Chandra Babu Approached by Union Minister Nitin Gadkari in the YS Jagan attack murder case
Chandra Babu Approached by Union Minister Nitin Gadkari in the YS Jagan attack murder case

అదీ సంగతి…….చంద్రబాబు వీరోచిత పోరాటాలు అలాగే ఉంటాయి. అప్పట్లో కాంగ్రెస్‌పై రంకెలేస్తూ చీకట్లో చిదంబరం కాళ్ళు పట్లుకున్న నిజం పార్లమెంట్ సాక్షిగా బయటపడిపోయింది. ఇప్పుడు కూడా ఢిల్లీలో కీలక పదవిలో ఉన్న తన కుల ప్రముఖుడి మధ్యవర్తిత్వంతో మహారాష్ట్రకు చెందిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరి శరణుజొచ్చాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఎవరు అవునన్నా….కాదన్నా జగన్‌పై హత్యాయత్నం జరిగిన మరుక్షణం నుంచీ చంద్రబాబుతో సహా ఆయన ప్రభుత్వంలోని డిజిపి నుంచీ లోకేష్‌తో సహా చాలా మంది మంత్రులు తత్తరపడుతున్నారన్నది నిజం. తెరవెనుక కారణాలు ఏవైనా కనీసం మడతపడని పది పేజీల లేఖ నిందితుడి జేబులో దొరికింది అని చెప్పడం నుంచీ జగన్‌పై హత్యాయత్నం ఎపిసోడ్‌లో చాలా అబద్ధాలే చెప్పి ప్రజలను నమ్మించాలని చూశారు. సిబిఐకి కూడా రాష్ట్రంలో ప్రవేశం లేదన్నారు. అయితే హైకోర్ట్ జోక్యంతో వ్యవహారం కేంద్రం దాకా వెళ్ళడం ఖాయం అయ్యేలానే కనిపిస్తోంది. హైకోర్ట్ తాజాగా కేంద్రప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూ ఇంకా పెద్దది అవకుండా కేంద్రంలో బాబుకు పెద్దదిక్కుగా ఉండే నేత, కీలక పదవిలో ఉన్న నేత ద్వారా రాయబారం జరిపి నితిన్ గడ్కరీని శరణుజొచ్చాడట బాబు. మరాఠా రాజకీయాలకు బాబుకు ఉన్న సంబంధం గురించి కొత్తగా చెప్పేదేముంది. బిజెపితో యుద్ధం చేస్తున్నానని చెప్పుకుంటూ ఉన్న చంద్రబాబు మరాఠా బిజెపి మంత్రి భార్యకు మాత్రం ఏకంగా టిటిడిలో కీలకపదవి కట్టబెట్టాడు. ఇదే టిటిడీని బిజెపి నేతలు ఏదో చేయబోతున్నారని రంకెలేస్తాడు చంద్రబాబు. ఒక నాలుకతో అలా మాట్లాడుతూనే మరోవైపు అదే బిజెపి నేత భార్యకు టిటిడిలో కీలక పదవి కట్టబెడతాడు. ఇప్పుడు కూడా ఆ పాత పరిచయాలతోనే మరోసారి తనను ఆదుకోమని బిజెపి నేతలతో చంద్రబాబు రాయబారం నడుపుతున్నాడన్న వార్తలు జాతీయస్థాయిలో వినిపిస్తున్నాయి.