Wednesday, April 24, 2024
- Advertisement -

తెలంగాణాలో టీడీపీ క్లోజ్‌…..?

- Advertisement -

తెలంగాణాలో టీడీపీ త‌ట్టా బుట్ట స‌ర్దుకొనే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ముంద‌స్తుగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఘోరంగా ఓట‌మి చ‌విచూసింది. ఇప్ప‌టికే ఆ పార్టీ నుంచి నేత‌లంద‌రూ కారెక్కారు. ఉన్న ఇద్ద‌రు ఎమ్మెల్యేల్లో సండ్ర వెంక‌ట వీర‌య్య‌కూడా గులాబీ గూటికి చేరనున్నారు. త్వ‌ర‌లో జ‌రిగే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో టీడీపీ ఒంట‌రిగా పోటీ చేయాల లేకుంటే కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోలా అనే దానిపై టీటీడీపీ నేత‌లు అయోమ‌యంలో ఉన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకుని లోక్ సభ ఎన్నికల్లో ముందుకు సాగాలని భావిస్తున్న టీ టీడీపీకి… ఆ పార్టీ అధినేత చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. శనివారం జరిగిన టీడీపీ పోలిట్‌బ్యూరో సమావేశానికి హాజ‌ర‌య్యారు టీ టీడీపీనేత‌లు. ప‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు, నిధుల విష‌యంలో మాట్లాడ‌తార‌ని అంతా భావించారు. కాని అక్క‌డ మాత్రం సీన్ రివ‌ర్స్ అయ్యింది. అయితే టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఏపీ వ్యవహారాలపైనే ఎక్కువగా చర్చించిన నేతలు… తెలంగాణ అంశాలను పెద్దగా ప్రస్తావించలేదని తెలుస్తోంది.

త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో తెలంగాణాకు సంబంధించిన వ్య‌వ‌హారంలో నేను జోక్యం చేసుకోన‌ని అది మీరె చూసుకోవాల్సిఉంద‌ని హ్యాండ్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లాలా ? లేక ఒంటరిగా పోటీ చేయాలా ? అనే దానిపై టీ టీడీపీలో డైలమా నెలకొంది. బ‌ల‌మైన టీఆర్ఎస్‌ను ఢీకొట్టాలంటె ఆర్థిక‌బ‌లం, అంగ‌బ‌లం తప్ప‌ని స‌రి. ఇప్ప‌టికే తెలంగాణాలో ముందుగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీఆర్ బంఫ‌ర్ మెజారిటీ అధికారంలోకి వ‌చ్చింది. అదే ఊపుతో ఇప్పుడు లోక్‌స‌భ సీట్ల స్వీప్‌పై గురి పెట్టింది.

టీడీపీలో ఉన్న బ‌ల‌మైన నాయ‌కులంద‌రూ కూడా కారెక్కుతున్నారు. ఇప్పుడు బాబు తెలంగాణాలో పీర్టీ విష‌యంలో చేతులెత్తేయ‌డంతో ఇక పార్టీలో ఉన్న నాయ‌కులంద‌రూ కూడా త‌మ దారి తాము చూసుకోనున్నారు. ఒంట‌రిగా పోటీ చేసె స‌త్తా ప్ర‌స్తుతం టీటీడీపీకి లేదు. పార్టీలో ఉన్న రాజ‌కీయాన‌కులు త‌మ భ‌విష్య‌త్తు కోసం అధికార పార్టీలోకి వెల్ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులు. ఉన్న నేత‌లు పార్టీని వీడితే ఇక తెలంగాణాలో టీడీపీ పూర్తిగా క్లోజ్ అయిన‌ట్లే…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -