Friday, April 19, 2024
- Advertisement -

బాబును నేల‌మీద‌కు దించుతున్న జ‌గ‌న్‌

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు జాతీయ‌స్థాయిలో చ‌క్రం తిప్పుతున్నారు. మోదీకి వ్య‌తిరేకంగా కూట‌మి క‌ట్ట‌డంలో తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. జాతీయ నాయ‌కులను ఏక‌తాటిపైకి తీసుకువ‌స్తున్నారు. అన్ని రాష్ట్రాల నేత‌ల‌తో నిత్యం భేటీలు జ‌రుపుతున్నారు. మొన్న‌టివ‌ర‌కు ఏ ఛాన‌ల్ పెట్టినా.. ఏ పేప‌ర్ చూసిన ఇలాంటి వార్త‌లే.

కానీ ఇలాంటి వార్త‌లు ఇప్పుడు ఎక్కువ‌గా క‌నిపించ‌డం లేదు. కార‌ణం వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. నాదంతా జాతీయ లెవ‌ల్‌.. రాష్ట్రంలో త‌న‌కు లేదు సాటీ లేదు.. అస‌లు త‌న‌కు పోటీనే లేదు అన్నట్టుగా దూసుకుపోతున్నాన్న‌ చంద్ర‌బాబుకు వాస్త‌వ ప‌రిస్థితులేంటో చూపించి.. గాల్లో ఉన్న చంద్ర‌బాబును నేల‌కు దింపారంటున్నారు.

అధికార పార్టీకి రోజుకో ట్విస్ట్ ఇస్తూ.. ఊపిరాడ‌కుండా చేస్తుండ‌టంతో ఏం చేయాలో పాలుపోలేని స్థితిలో చంద్ర‌బాబు క్యాంప్ ఉంది. అనుకూల మీడియాలో విష‌యాల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా… సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని విజ‌యం సాధించ‌డం లేదు. ఉద‌హార‌ణ‌కు ఆమంచి చేరిక‌పై అలిగిన ఓ నేత వ్యాఖ్య‌ల‌ను ప్ర‌ముఖంగా చూపిస్తున్నందుకు మీడియాకు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇస్తున్నారు నెటిజ‌న్లు. 23 మందిని చేర్చుకున్న‌ప్పుడు ఈ మీడియా ఎక్క‌డ‌కు పోయింద‌ని డైరెక్ట్‌గానే అడుగుతున్నారు. అంతేగాకుండా వాళ్ల‌ని ఫిరాయించ‌మ‌ని కోర‌కుండా.. ప‌ద‌వికి కూడా రాజీనామా చేయాల‌ని.. ప్ర‌జ‌ల అంగీకారంతోనే గెల‌వాల‌ని జ‌గ‌న్‌ సూచించ‌డం మంచిదే క‌దా అని ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోవ‌డం లేదు చంద్ర‌బాబుకు.

దీంతో గ‌త కొన్ని రోజులుగా జాతీయ రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి చంద్ర‌బాబును రాష్ట్రానికే ప‌రిమితం చేశారు. నేల‌విడిచి సాము చేయ‌డం కంటే.. మొద‌ట మ‌న ఇళ్లు చ‌క్క‌దిద్దుకొని త‌ర్వాత దేశ రాజ‌కీయాల‌పై దృష్టి సారిస్తే మంచిద‌ని చంద్ర‌బాబుకు జ్ఞానోద‌యం అయ్యిందంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -