Saturday, April 20, 2024
- Advertisement -

ఎఫ్ 2 సినిమాను త‌ల‌పిస్తున్న బాబు, లోకేష్ ప‌రిస్థితి..!

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల సినిమా ముగిసినా రాజ‌కీయ పార్టీల్లో మాత్రం రోజు రోజుకీ ఉత్కంఠ‌ను రేకెత్తిస్తోంది. ఫ‌లితాల కోసం ఎదురు చూస్తున్నారు. 80 శాతం పోలింగ్ న‌మోద‌య్యింది.గెలుపుపై వైఎస్ జ‌గ‌న్ , బాబు ఎవ‌రి ధీమా వారు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే గెలుస్తామ‌ని జ‌గ‌న్ కాన్ఫిడెంట్‌గా ఉండ‌గా…బాబులో మాత్రం ఆధీమా క‌నిపించ‌డంలేదు. అన్ని స‌ర్వేలు వైసీపీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని తేల్చి చెప్ప‌డంతో బాబు, లోకేష్ లు పూర్తి ప్ర‌స్టేష‌న్‌లోకి వెల్లిపోయారు.

గెలుపు మాదేన‌ని పైకి గంభీరంగా బాబు చెప్తున్న లోలోప‌ల మాత్రం క‌క్క మింగ‌లేక నానా తంటాలు ప‌డుతున్నారు. ఓట‌మి త‌ప్ప‌ద‌ని తెలిసినా పార్టీ నేత‌ల్లో ఉత్సాహాన్ని నింపేందుకు బాబు తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం బాబు, లోకేస్‌ల ప‌రిస్థితి ఎలా ఉందంటె ఎఫ్ 2 సినిమాలా త‌యార‌య్యింది.

గెలుపుపై జ‌గ‌న్ జోష్‌గా క‌నిపిస్తుంటె బాబు, లోకేష్‌లు మాత్రం ప్రెస్టేష‌న్ లోకి వెల్లిన ఇద్ద‌రూ ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. పోలింగ్ రోజున నారాలోకేష్ చిన్న పిల్లాడిలా మాట్లాడారు. పోలింగ్ బూత్‌లో అధికారులు ఓట‌ర్ల‌కు టీ, బిస్కెట్ ఏర్ప‌టు చేయ‌లేద‌ని చిన్న పిల్ల‌లు మారా చేసిన‌ట్లు వ్యాఖ్య‌లు చేశారు. ఓట‌ర్లు ఎవ‌రూ కూడా ఏర్పాట్ల‌పై అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌లేదు.

ఇక బాబు విష‌యానికి వ‌స్తె ప్ర‌స్టేష‌న్‌లో పిచ్చి ప‌ట్టిన‌ట్లుగా మాట్లాడుతున్నారు. పోలింగ్ పూర్తి అయిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఎంత అసహనంతో రగిలిపోతున్నారో అర్థం చేసుకోవడం కష్టం ఏమీకాదు. ఈసీ మీద విమ‌ర్శ‌లు చేయ‌డం, వీవీప్యాట్ల‌లోని 50 శాతం స్లిప్ ల‌ను లెక్కించాల‌న‌డం, రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ అధికారిపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక ఈవీఎంలు స‌గానికి పైగా ప‌నిచేయ‌డంలేద‌ని గ‌గ్గోలు పెట్ట‌డం నుంచి… ఈవీఎంల‌లో ఓటు ఒక‌రికి వేస్తే …మ‌రో క పార్టీకి ప‌డుతోంద‌ని సాక్షాత్తు బాబే ఓటు వేసిన త‌ర్వాత మాట్లాడ‌టం చూస్తె ప్ర‌జ‌లంద‌రూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు.

అప్పుడే ఫిర్యాదు చేయ‌కుండా పోలింగ్ ముగిసిన రెండు రోజుల త‌ర్వాత ఇలా మాట్లాడ‌టం చూస్తె బాబు నికృష్ట రాజ‌కీయానికి ప‌రాకాష్ట‌. పోలింగ్ స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షం వైసీపీ నేత‌లు టీడీపీ శ్రేణుల‌పై దాడులు చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు చేయ‌డం ఆయ‌న దివాలా కోరుత‌నానికి నిద‌ర్శ‌నం. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌లు ఎవ‌రూ కూడా ఒక‌రికి ఓటు వేస్తె …మ‌రో క‌పార్టీకి ప‌డుతోంద‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఎవ‌రూ ఫిర్యాదు చేయ‌లేదు. 80 శాతం మంది ఓట‌ర్ల‌కు రాని అనుమానం కేవ‌లం బాబు అండ్ కోకు మాత్ర‌మే రావ‌డం విడ్డూరం. ఇవ‌న్నీ చూస్తె ఓట‌మి ప్ర‌స్టేష‌న్‌లో బాబు, లోకేష్‌ల మాన‌సిక స‌రిస్థితి ఎఫ్ 2 సినిమాలాగా త‌యార‌య్యింద‌ని ప్ర‌జ‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -