Friday, March 29, 2024
- Advertisement -

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పచ్చ మీడియాపై జగన్ గెలిచాడు… యస్ గెలిచాడు

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవికి చేతకాలేదు………..ఘోరంగా ఓడిపోయాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చేతులెత్తేశాడు. హరికృష్ణతో సహా నందమూరి కొడుకుల పార్టీలతో సహా ఎందరో……..ఎందరెందరో నాయకులు పచ్చ మీడియా అండతో, కుల పారిశ్రామికవేత్తల ఖజానా కాసులతో రెచ్చిపోతున్న చంద్రబాబును ఎదుర్కోలేకపోయారు. కేవలం ఒక్క ఎన్నికలకే అందరూ పరిమితమైపోయారు. కానీ జగన్ నిలిచాడు. గెలిచాడు. ఎన్ని ఎన్నికలయినా సరే చంద్రబాబుతో పోరాడే విషయంలో రాజీపడేది లేదు అన్నంత కృతనిశ్ఛయంతో ప్రజలకు అండగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నాట వైఎస్ జగన్ లేకపోతే గత ఐదేళ్ళలో చంద్రబాబు అండ్ కో ఏ రేంజ్‌లో రెచ్చిపోయి ఉండేవాళ్ళో ప్రత్యేకంగా చెప్పాలా? అప్పటికీ హోదాతో సహా సంక్షేమ పథకాలతో సహా అన్ని విషయాల్లోనూ జగన్ ప్రజలకు అండగా ఉండడంతో ప్రతిసారీ యూటర్న్ తీసుకుంటూ, కాపీ కొడుతూ మేనేజ్ చేయాలనే ప్రయత్నం చేశాడు చంద్రబాబు. లేకపోతే అవినీతి, అక్రమాలు, హోదాతో సహా ఎన్నో విషయాల్లో బాబు అండ్ బ్యాచ్ ఏ రేంజ్‌లో రెచ్చిపోయి ఉండేవారో చెప్పనవసరం లేదు. అందుకే ఒక్క ఎన్నికల్లో పోటీపడి చాట చుట్టేసిన కిరణ్ కుమార్‌రెడ్డితో సహా చాలా మంది నాయకులు, స్టార్స్ కంటే జగన్ నిలిచాడు……..గెలిచాడు.

జగన్ గెలిచాడు… యస్ జగన్ గెలిచాడు…!!

జగన్ ఒక ఫ్యాక్షనిస్ట్ అని నరరూప రాక్షసుడు పరిటాల రవిని చంపించాడు అని ఊదరగొట్టారు, నిజమే అని జనాలు ఒకటికి రెండు కలిపించుకునేలా చేసారు. అంత ఫ్యాక్షనిస్ట్ అయితే తాతని చంపినోల్లు ఇంకా బతికే ఉన్నారు కదా అని అడిగినోడు ఒక్కడులేడు…! ఆ తర్వాత అదే పరిటాల రవి హత్యలో ప్రధాన నిందితుడు అని ఢిల్లీ నుంచీ గల్లీ వరకూ చాటింపు వేసిన జేసీ దివాకరరెడ్డిని స్వయంగా టిడిపిలో చేర్చుకున్నారు. ఇప్పుడు పరిటాల సునీత, జేసీలు కలిసి ప్రచారం చేస్తున్నారు.

లక్షకోట్లు దేశసంపదం మొత్తం ఊడ్చేసాడు, అసలింక భారతదేశంలో ఏం మిగల్లేదు అనే రేంజ్ లో రాసారు. డజన్లకొద్ది మీడియా చానెల్లలో పత్రికలలో రాసి వాళ్ళకి వాళ్లే తీర్పులిచ్చేసారు… ఒక చానెల్ అయితే ఒక అడుగు ముందుకేసి జగన్ కి ఖైదీ డ్రస్ వేసి గ్రాఫిక్ వీడియో చేసారు… ఒకానొకదశలో జగన్ పేరు చెబితే అంటరాని వారిలా చూసే స్థాయికి తెచ్చారు… తన తండ్రిని, తల్లిని, చెల్లిని, భార్యను కూడా వదల్లేదు… పెద్దల్ని గౌరవించడు, మర్యాద తెలీదు అని ప్రచారం చేసారు… అదేదో వాల్లింట్లోనే వీళ్లంతా ఉండి చూసినట్లు, ఇంట్లో వందల గదులు, బార్లు అని రాసి వదిలారు… ఒక వ్యక్తిని ఎంత నీచంగా ప్రొజెక్ట్ చేయాలో అంతా చేసారు.

అందులో సగం కూడా చేయకుండానే NTR నుండి చిరంజీవి వరకు ఎందరో వ్యక్తుల్ని అడ్డు తొలగించుకున్నారు… భయపెట్టారు… కానీ జగన్ భయపడలే, తొణకలే, నమ్మిన సిద్దాంతాన్ని వదల్లే, చిరునవ్వుతో ఎదుర్కొన్నాడు… సొంతవాల్లు దూరం అయినా, తన తండ్రి మోచేతి నీల్లు తాగిన వాల్లు కూడా విమర్శించినా, పరాభవించినా సంయమనం కోల్పోలే, నిలబడ్డాడు… ఎదిగాడు..

ఇప్పుడు తప్పుడు తెరలు తొలిగి పోతున్నాయి, 40 ఏళ్ల వయసులో 40 ఏళ్ల అనుభవం అని డబ్బా కొట్టుకునే డబ్బారాయుడికి చెమటలు పట్టిస్తున్నాడు… ఆయన దైర్యం, తెగింపు అనితరసాద్యం, అనిర్వచనీయం… మొండోడివయా జగన్ అందుకే గెలిచావ్, నీ అభిమానులుగా మమ్మల్ని గెలిపించావ్……..అని ఇప్పుడు స్వయంగా జగన్ అభిమానులే కాలర్ ఎగరేసి మరీ గర్వంగా చెప్పుకుంటున్నారంటే జగన్ గెలిచాడు………….తటస్థులు, మేధావులు, మాజీ ఐఎఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా జగన్‌ని వేనోళ్ళ పొగుడుతున్నారంటే జగన్ గెలిచాడు. గెలిచి నిలిచాడు. కాదంటారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -