Friday, March 29, 2024
- Advertisement -

అధికారి పార్టీని ముప్పు తిప్పలు పెడుతున్న చంద్రబాబు..?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పేరుకు వైసీపీదే కానీ.. అందుకు తగ్గట్లుగా ఏ పని జరగడం లేదనేది రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తున్న లోతైన మాట. ఎందుకంటే వైసీపీ ఏం చేయాలనుకున్నది ఏది సక్రమంగా జరగడం లేదు. కానీ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఏం అనుకుంటున్నారో.. ఏం వ్యూహం రచిస్తున్నారో అది సక్రమంగా బల్లగుద్దినట్లు జరుగుతునట్లు కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీకి భారీ దెబ్బ పడినప్పటికి.. ఇంకా టీడీపీ అధినేతే అధికారంలో ఉన్నారా అనే విధంగా ఏపీలో పరిణామాలు జరుగుతున్నాయి.

దీనిని వైసీపీ జీర్ణించుకోలేకపోతున్నట్లు కనిపిస్తోంది. మూడు రాజధానుల విషయంలో మండలిలో ఛైర్మన్ నిర్ణయం..ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా ..ఇలా వరుసగా వైసీపీకి భారీ దెబ్బలు తగులుతున్నాయి. అయితే అసలు వైఫల్యం ఎక్కడ ఉందనే దాని పైన విశ్లేషణలు కూడా మొదలైయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చి పది నెలలు అయింది. సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవరుస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కోలేకపోయిన బాబు.. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ముఖ్యమైన అంశాలను ఇరుకున పెట్టే విధంగా తన అనుభవంను ఉపయోగిస్తున్నారు.

కేబినెట్ లో నిర్ణయం.. ఏపీ మూడు రాజధానులు.. సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లును అమోదించుకున్న వైసీపీకి.. శాసనమండలిలో ఊహించని విధంగా షాక్ తగిలింది. మండలి ఛైర్మన్ తనకున్న విచక్షణాధికారం మేరకు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించడం తో సీన్ రివర్స్ అయింది. వెంటనే మండల్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మాణం చేశారు. మండలి గ్యాలరీలో చంద్రబాబు కూర్చుని చైర్మన్ ను శాసించారని అందరి వాదన. ఇక సీఎం జగన్ ఎన్నికలను ఈ నెలలో కంప్లీట్ చేయాలని నిర్ణయించారు. స్థానిక ఎన్నికల్లో విజయ ఢంక మోగించి తన రెండో ఏటా పాలనలోకి అడుగు మోపాలని అనుకున్నారు.

కానీ ఊహించని రీతిలో ప్రభుత్వంతో ఎలాంటి సమాచారం లేకుండానే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను వాయిదా వేసింది. అయితే ఆ తర్వాత ఎన్నికల కమిషనర్ కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు కారణంగానే రమేష్ కుమార్ ఎన్నికలు వాయిదా వేసారని స్వయంగా సీఎం జగన్ అన్నారు. మంత్రులు కూడా ఇదే రకంగా మాట్లాడుతూ వచ్చారు. వైసీపీ అంత చంద్రబాబు కారణంగానే ఎన్నికలు ఆగిపోయాయని చెబుతున్న క్రమంలో వైసీపీ అధికారంలో ఉన్నా.. బాబు పెత్తనమే ఏపీలో సాగుతుందన్న అంశాన్ని పరోక్షంగా అంగీకరిస్తున్నట్లుగా అర్దం అవుతుందని విశ్లేషణలు మొదలయ్యాయి.

చంద్రబాబు కారణంగా నాడు మండలిలో బిల్లులు, నేడు ఎన్నికల వాయిదా అని ప్రభుత్వం చెప్పటం కొత్త చర్చకు దారి తీసింది. ఇక రోజా ఎన్నికల వాయిదాకు కారణం ముందుగా కరోనా అని వాధించి.. మరికాసెపటికి మరో ప్రెస్ మీట్ లో ఎన్నికలకు కారణం చంద్రబాబే అని మాట్లాడింది. ఏది ఏమైన అధికారి పార్టీని చంద్రబాబు ముప్పు తిప్పలు పెడుతున్నట్లు ఈ అంశాల ద్వారా అర్దం అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -