Wednesday, April 24, 2024
- Advertisement -

చంద్రబాబు కు తెలుగు తమ్ముళ్ళను కలిసే టైం కూడా లేదా..

- Advertisement -

చంద్రబాబు కి ఆంధ్రప్రదేశ్ లో ఏమొహం పెట్టుకుని రాజకీయం చేయాలో అర్థం కావట్లేదు..ఓ వైపు ప్రజలంతా కలిసి ఆయన్ని దారుణంగా ఓడించారు.. మరోవైపు అమరావతి లో ని ప్రజలను మోసం చేసి రాజధాని ని అభివృద్ధి చేయకుండా అక్కడినుంచి తరలించేలా చేశారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకునే తమ్ముళ్లు ఒక్కరు కూడా లేకుండా పోయారు. చంద్రబాబు అయితే హైదరాబాద్ లోని తన నివాసం నుండి బయటకు రాలేదు.. లోకేష్ సంగతి చెప్పనవసరం లేదు.. మామూలుగానే బయటకి రాడు.. ఇక కరోనా సమయంలో అయితే గుమ్మం నుండి బయటకు రాలేదు..

చంద్రబాబు గత ఎనిమిది నెలలుగా రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు అని చెప్పాలి. రాష్ట్రంలోని ఏ సమస్య ని అయన పట్టించుకోలేదు.. కనీసం బీజేపీ, జనసేన పార్టీ లు అయినా కొంత ప్రజల్లోకి వెళ్ళడానికి ట్రై చేశాయి కానీ టీడీపీ మాత్రం ఎక్కడి దొంగలు అక్కడనే అన్నట్లు వ్యవహరించింది.. అప్పుడప్పుడు వచ్చినా పెద్దగా ఉపయోగం లేని పనులే చేశారు.. ఇక చంద్రబాబు ను కలుద్దామనుకున్న తమ్ముళ్ళకి నిరాశ ఎదురైంది.. ఈ క్ర‌మంలో  ఇటీవలే ఆయ‌న అమ‌రావ‌తి ప్రాంతానికి రావ‌డంతో ఆయ‌న‌ను క‌ల‌వొచ్చ‌ని క్యాడ‌ర్ ఆయ‌న నివాసం వ‌ద్ద‌కు చేరుకోగా.. వారికి చంద్ర‌బాబు నాయుడుతో స‌మావేశం అయ్యే అవ‌కాశం ద‌క్క‌లేదు.

క‌రోనా భ‌యాల‌తో చంద్ర‌బాబు నాయుడు ఎవ్వ‌రినీ క‌ల‌వ‌డానికి ఇష్ట‌ప‌డ‌డు . దీంతో ఆయ‌న ఏపీకి వ‌చ్చాడ‌ని, క‌ల‌వొచ్చ‌ని అనుకున్న వారు అదేం జ‌ర‌గ‌కుండానే వెనుదిర‌గాల్సి వ‌చ్చింద‌ని తెలుస్తోంది. సరే చంద్రబాబు అంటే 70 ఏళ్ళు దాటినవాడు కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువ మరి లోకేష్ అయినా తమ్ముళ్ల గోడు వినొచ్చు గా అని తమ్ముళ్లు ఆశపడుతున్నారు.. అయితే లోకేష్ కి అలాంటి చొరవ ముందునుంచి లేదు ఇప్పుడు కొత్తగా ఆయన్ని అని ఏం లాభం వాళ్లలో వాళ్ళే అనుకుంటున్నారట.. ఏమైనా ఆన్ లైన్ రాజకీయాలు చేస్తూ అందరి ని మభ్యపెడుతున్న వీరు రాబోయే ఎన్నికల్లో కి ఎలా అధికారంలోకి వస్తారో అన్న అనుమానం టీడీపీ నేతల్లో కూడా కలుగుతుంది.

చంద్రబాబు కి మరో షాక్.. ఇది కూడా ఫలించకపాయే..?

టీడీపీ ని తల్లి కొడుకులు పూర్తి గా వదిలేసినట్లేనా..?

చంద్రబాబు వేషాలు తమిళ మీడియా సాక్షిగా తెలిసింది..?

చంద్రబాబు 40 ఇయర్స్ రాజకీయం ఇదేనా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -