Saturday, April 20, 2024
- Advertisement -

హ….. హా…… కొనుగోళ్ళు, క్యాంప్ రాజకీయాలు, ప్రజాస్వామ్యం గురించే బాబే చెప్పాలా?

- Advertisement -

సందు దొరికితే చాలు…….. పిల్లల పెంపకం నుంచీ అన్ని విషయాల్లోనూ నీతి సూత్రాలు చెప్తా అని బయల్దేరతాడు చంద్రబాబు. ఆ మధ్య ఆంధ్రా అన్నా హజారే అంటూ ఒక జెండా మోసి బాగానే క్యాష్ చేసుకున్నాడు. ఇప్పుడిక ఈ ఎమ్మెల్యేల కొనుగోళ్ళు, క్యాంప్ రాజకీయాల గురించి నీతి సూత్రాలు వల్లించడం మొదలెట్టాడు. సాధారణంగా సామాన్యులు ఎవ్వరికైనా తాము అవినీతి చేస్తూ, తాము తప్పులు చేస్తూ అవే తప్పులు చేస్తున్న ఎదుటి వాళ్ళను విమర్శించడానికి నైతికత అడ్డొస్తుంది. కానీ చంద్రబాబుకు మాత్రం అలాంటివేమీ ఉండవు. అవినీతి చేస్తూ, ఎమ్మెల్సీ కొనుగోళ్ళ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయాక కూడా సిగ్గు లేకుండా నీతి సూత్రాలు చెప్పగలడు. ఇప్పుడు ఇవే విషయాలను వైకాపా గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఐవి రెడ్డి కూడా చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, బాబు నడిపిన క్యాంప్ రాజకీయాలను ప్రజలు మర్చిపోయారన్న భ్రమల్లో చంద్రబాబు ఉన్నాడా? సీనియర్ ఎన్టీఆర్ నుంచీ జూనియర్ ఎన్టీఆర్ వరకూ పవన్ కళ్యాణ్‌తో సహా వాజ్‌పేయి నుంచీ మోడీ వరకూ, కమ్యూనిస్టులతో సహా అందరినీ వాడుకుని వదిలేయడం, కనీస స్థాయి విలువలు కూడా లేకుండా వ్యవహరించే చంద్రబాబుకు అసలు విలువల గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించాడు ఐవి రెడ్డి. రాజకీయ విలువల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నాడు. ఒక ఎమ్మెల్సీ కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా బుక్కయ్యి……23 మంది వైకాపా ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనేసి అందులో కొంతమందికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టిన చంద్రబాబు రాజకీయ విలువల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఐవి రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యం గెలిచింది, విలువలు గెలిచాయి అన్న చంద్రబాబు కామెంట్స్‌ని అద్భుతం అన్నట్టుగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంటే నెటిజనులు మాత్రం కామెడీ కౌంటర్స్‌తో బాబును ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఐవి రెడ్డి కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -