చంద్రబాబు, లోకేష్ ల ఘనత దేశ వ్యాప్తంగా..?

364
Chandrababu is losing face at the national level
Chandrababu is losing face at the national level

చంద్రబాబు త్వరలోనే ప్రధానమంత్రి అవుతారు ఆయనకు అక్కడ మంచి పట్టు ఉంది.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే ఏకైక తెలుగు నేత చంద్రబాబు అని గత ప్రభుత్వ హయాంలో ఆయనపై అనుకూల ఎల్లో మీడియా చేసిన ప్రచురణలు అన్నీ ఇన్నీ కావు.. ఒక్కసారిగా మోడీ కి ప్రత్యామ్నాయం చంద్రబాబు అని చెప్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు.. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారు అయిపొయింది. జగన్ ప్రభుత్వం లోకి వచ్చిన తరువాత చంద్రబాబు జాతీయ స్థాయిలో చేసిన అక్రమాలు వెలికి తీయబడుతున్నాయి..

ఇప్పటికే చంద్రబాబు అండ్ కో రాష్ట్రంలో పలు అవినీతి కేసుల్లో పట్టుబడిజైలుకి వెళ్లొస్తున్న సంఘటనలు చూసాం.. చంద్రబాబు అమరావతిలో భూ కుంభకోణం గురించి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలోనూ, ఫైబర్‌ నెట్‌ కాంట్రాక్టు పేరిట నారా లోకేష్‌నాయుడు పాల్పడిన అక్రమాలను గురించి ది హిందూ పత్రికలోనూ మొదటి పేజీల్లో వార్తలు రావడం ద్వారా వారిద్దరి అవినీతి చరిత్ర ఇప్పుడు దేశ స్థాయిలో చర్చించుకుంటూ తెలుగు వారి పరువును దిగజార్చే విధంగా వారి ప్రవర్తిస్తున్నారు..

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ పథకాలను అమలు చేయడం తో పాటు , అవినీతి కి పాల్పడిన నేతలను కలుపు మొక్కలను ఎరుతున్నట్లు ఏరడం ఇప్పుడు వాటిపై పలు విచారణా బృందాలను కూడా ఏర్పాటు చేయడం ఇప్పటికే రాష్ట్రంలో పలువురు టీడీపీ నాయకులపై చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకోవడం చకచక జరిగిపోయాయి.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలను ఎదుర్కొనేందుకు చంద్రబాబు బృందం కూడా ఎదుర్కొలు చర్యలకు దిగుతోంది. ఇప్పటికే పలు దర్యాప్తులపై కోర్టుల ద్వారా స్టేలు తెచ్చుకున్నారు.అయితే ఇది ఎలా ఉందంటే తప్పు చేసిన తమని కాపాడాలంటూ వారు కోర్తులకేక్కడం ఎంతవరకు న్యాయమో అర్థం కావట్లేదు.. ఏదేమైనా ఈ దిగజారుడు రాజకీయం చేసి టీడీపీ ఎన్నేళ్ళు నెట్టుకోస్తుందో అర్థం కావట్లేదు..

Loading...