Thursday, April 25, 2024
- Advertisement -

చంద్రబాబు కు ఇప్పుడు వాళ్ళే దిక్కా..?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ కి ఒక రకంగా గడ్డు కాలమే నడుస్తుందని చెప్పాలి.. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి దగ్గరి నుంచి చంద్రబాబు ఆయనకు సవ్యమైన పాలనా చేయనీయకుండా అడ్డుకుంటున్నారని చెప్పొచ్చు.. ప్రస్తుతం సమస్యల వలయంలో ప్రభుతువం ఉందని ఎవరైనా అంటారు.. ఓ వైపు మతపరమైన అల్లర్లు రేపడానికి ప్రయత్నాలు, మరోవైపు ఎటు తేలని రాజధాని అంశం మరో వైపు అనుభవం ఉన్న ప్రతిపక్ష నేతలు కలిసి యువకుడైన, మొట్టమొదటి సారి అధికారమెక్కిన జగన్ ని ఉక్కిరి బిక్కిరి చేయడం కలిసి ఒక్కసారిగా వైసీపీ పార్టీ కి చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పొచ్చు..

అయితే అంతా తమ చేతుల్లోనే ఉందన్న పరిస్థితి ఒక్కసారిగా ఇలా వ్యతిరేకమేలా ఐయ్యింది అని చూసుకుంటుంటే తెలుగు తమ్ముళ్లు చెప్తున్న ఒకే ఒక్క సమాధానం  చంద్రబాబు.. చంద్రబాబే జగన్ కి ఈ పరిస్థితి తెచ్చాడని అంటున్నారు.. చంద్రబాబు వేసిన ప్రణాళిక వల్లే జగన్ స్థితి ఇలా అయిపోయిందని అంటున్నారు.. అయితే జగన్ ని ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు వేసిన ప్లాన్ ఏంటి అంటే మ‌రి రాష్ట్రంలో ఎలాగూ ఆయ‌న‌కు అధికారం పోయింది. ఇక్కడ ఆయ‌న మాట వినే అధికారి ఎవ‌రూ లేరు.

ప‌క్కరాష్ట్రం తెలంగాణ‌లోనూ ఆయ‌న కుక్కిన పేనల్లే ఉంటున్నారు. మ‌రి ఎవ‌రు చంద్రబాబుకు ఇప్పుడు వెన్నుద‌న్నుగా నిలుస్తున్నారు? అంటే.. త‌మ్ముళ్ల వేళ్లన్నీ.. ఇప్పుడు ఢిల్లీ వైపు చూపిస్తున్నాయి. నిజమే.. తాను అధికారంలో ఉన్న స‌మ‌యంలో చాలా మందికి చంద్రబాబు మేళ్లు చేశారు. ఈ మేళ్లు వల్ల ల‌బ్ధిపొందిన వారిలో ఇప్పుడు కేంద్రంలో కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న వారితో పాటు ఉన్న న్యాయ వ్యవ‌స్థలో ఉన్నవారు కూడా ఉన్నార‌ని తమ్ముళ్లు అనుకుంటున్నారు.. అయితే వారు చంద్రబాబు ఋణం ఇలా తీర్చుకుంటున్నారని తమ్ముళ్ల వాదన.. సరిపోయింది.. చంద్రబాబు ఎప్పుడెప్పుడు ఎన్నికలొస్తాయా, అధికారంలోకి వద్దామా అని పగటి కలలు కంటుంటే తమ్ముళ్లు ఇలా చెప్పుకుని తిరుగుతూ భ్రమలో బ్రతికేస్తున్నారన్నమాట..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -