Wednesday, April 24, 2024
- Advertisement -

ఇక రాజకీయంలో మాగంటి ప్రస్థానం ముగిసినట్లేనా…?

- Advertisement -

రాష్ట్ర రాజకీయాల్లో మాగంటి కుటుంబం ముద్ర తప్పకుండా ఉంటుందని చెప్పాలి.. రాజకీయాల్లో మాగంటి కుటుంబానికి 130 ఎల్లా చరిత్ర ఉంది. మాగంటి సీతారామదాసు దగ్గరినుంచి ఇప్పటి మాగంటి రాంజీ వరకు కుటుంబంలోని ప్రతి ఒక్కరు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర వహించారు. రాజకీయంగా  మాగంటి బాబు ఈ తరం వారికి ఎక్కువగా తెలుసు..తండ్రి మాగంటి ర‌వీంద్రనాథ్ చౌద‌రి, త‌ల్లి మాగంటి వ‌ర‌ల‌క్ష్మీ దేవితో పాటు కుమారుడు మాగంటి బాబు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులు గా చేశారు.. మాగంటి బాబు ఎంపి గా కూడా గెలిచారు.. మొదట్లో కాంగ్రెస్ లో ఉన్న బాబు యా తర్వాత టీడీపీ లో కి చేరారు.. 2009 లో ఎంపి గా పోటీ చేసి ఓడిపోయినా 2014 లో గెలిచారు. 

రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న మాగంటి బాబు కు సొంత నియోజక వర్గంలో వర్గ పోరు ఆయనను రాజకీయంగా మరింతగా ఎదగకుండా చేసింది.. పార్టీ ఎమెల్యేలు, అధికారులు, కన్వినర్లు అనే తేడా లేకుండా అందరితో విభేదాలకు దిగి రాజకీయ భవిష్యత్ లేకుండా చేసుకున్నారని టీడీపీ నేతల వివరణ..  మాజీ మంత్రి పీత‌ల సుజాత,  ముద్దర‌బోయిన వెంక‌టేశ్వర‌రావు, మొడియం శ్రీను  వంటి టీడీపీ ముఖ్య నేతలతో అయన విభేదాలకు దిగి వేరే కుంపటి పెట్టారు.. చంద్రబాబు పలుమార్లు హెచ్చరించినా తీరు మారలేదు.. 

ఇక ప్రస్తుతం ఆయన వారసుడు మాగంటి రాంజీ ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించాలని ప్రయత్నిస్తున్నా చంద్రబాబు వారి ఫ్యామిలీ వైపు చూసే ఆలోచన లేదట.. ఇప్పటికే మాగంటి రాంజీ జిల్లా తెలుగు యువ‌త అధ్యక్షుడిగా కొన‌సాగుతున్నారు. కనీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏలూరు ఎంపీ సీటు త‌న‌దే అన్న ధీమాతో ఉన్నట్టు టాక్‌..? మాగంటి బాబు కూడా తాను త‌ప్పుకుని త‌న వార‌సుడికి లైన్ క్లీయ‌ర్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఏలూరు పార్లమెంట‌రీ జిల్లా పార్టీ ప‌గ్గాలు ఇచ్చేందుకు ఒక‌రిద్దరు మాజీ ఎమ్మెల్యేల పేర్లు ప‌రిశీలిస్తోన్న బాబు మాగంటి వార‌సుడు రాంజీ క‌నీసం చంద్రబాబు దృష్టిలోనే లేడ‌ని అంటున్నారు. ఏదైనా అనూహ్యం జ‌రిగితే త‌ప్పా మ‌ళ్లీ ఈ కుటుంబ రాజ‌కీయ వెలుగులు క‌న‌ప‌డే ప‌రిస్థితి లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -