Thursday, April 25, 2024
- Advertisement -

యూటర్న్’ బ్రాండ్ అంబాసిడర్ బాబే..

- Advertisement -

‘వెన్నుపోటు’ బ్రాండ్ అంబాసిడర్ అని తెలుగు రాష్ట్రాల్లో ఎవరినైనా అడిగితే ఠక్కున చెప్పే ఒకే ఒక పేరు చంద్రబాబు మాత్రమే..చంద్రబాబు గత చరిత్రే ‘నమ్మకద్రోహం’ నుంచి పుట్టిందని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు.. పిల్లనిచ్చిన సొంత మామకే వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిని సీఎం పీఠం అధిరోహించిన చంద్రబాబు ఘనత అంతా ఇంతా కాదని సెటైర్లు వేస్తుంటారు. రాజకీయాల్లో వాడుకోవడం.. అవసరం తీరాక కూరలో కరివేపాకులా తీసిపారేయడం చంద్రబాబుకు అలవాటు అంటారు. అలా బాబు చేతిలో మోసపోయిన వారు ఎందరో కక్కలేక మింగలేక రాజకీయాల్లో అంతర్థానమైపోయిన వారు ఎందరో.. తాను తిట్టిపోసిన కాంగ్రెసుతోనే మళ్ళీ అంటకాగల సమర్థుడు చంద్రబాబు.. కాంగ్రెస్ తో పొత్తుకోసం మోడీని నానాతిట్లూ తిట్టాడు. ఇపుడు మళ్ళీ కాంగ్రెస్ కు హ్యాండిచ్చి మళ్లీ యూటర్న్ తీసుకుని బీజేపి కి దగ్గరకావాలని కొత్తకుట్రలకు సిద్దమవుతున్నాడు..

బాబును నమ్మిన కాంగ్రెస్ కి ఈ యూ టర్న్ కొత్త షాకునిస్తోంది..అయితే ఓ వైపు ఏపీ బీజేపి ఇన్ చార్జిగా ఉన్న సునీల్ దియోధరా మాత్రం బాబు ను ఎట్టి పరిస్థితులలో నమ్మవద్దని ప్రకటనలు ఇస్తున్నారు. బాబు యూటర్న్ తీసుకోవాలనుకుంటున్నా తాము గేట్ లు క్లోజ్ చేసామని చెబుతున్నాడు..అయినా బాబు యూటర్న్ ప్రయత్నాలు,లాబీయింగ్ మాత్రం సుజనా చౌదరి ద్వారా నడుస్తూనే ఉన్నాడని టీడిపి నేతలు చెబుతున్నారు.. ఎన్నికల సమయంలో మోడీని,అమిత్ షాను రాయకూడని భాషలో తిట్టిన తాము మళ్లీ బీజేపి ని పొగడుతూ మాటాడాలంటే సిగ్గుగా ఉందని యూటర్న్ చంద్రబాబు సొంత పార్టీ టీడీపీ నేతలే మదనపడుతుండడం విశేషం.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో యూటర్న్ లకు కర్త కర్మ క్రియ బాస్ గా చంద్రబాబు మారిపోయారనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయంగా యూటర్న్ లే కాదు, ప్రత్యేక హోదాపై ,రాష్ట్రాభివృద్ధిపై టర్న్ లపై యూటర్న్ లు తీసుకున్న చంద్రబాబు ఇప్పుడు తన హయాం లో భుజాలకెతుకున్న కాంట్రాక్టర్లను,వ్యాపారవేత్తలపై కూడా యూ టర్న్ లు తీసుకుంటూ తన వక్రబుద్ధిని‌ బయట పెట్టుకుంటున్నారని పారిశ్రామికవేత్తలు మండిపండుతున్నారు..పోలవరం కాంట్రాక్ట్ పనులను ఓ పత్రికాధిపతి అధినేత వియ్యంకుడైన నవయుగ కంపెనీకు ఇవ్వడం వల్ల అప్పట్లో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్ర నిధులను సాంతం నాకేశారన్న విమర్శలున్నాయి. బాబు నిర్ణయం‌ వల్ల పోలవరం పనుల్లో నవయుగ భారీగా నష్టపోయిందనే నిజాలు ఉన్నాయి..

తన ఘనతే అని డబ్బాలు కొట్టి..
ఇక పట్టి సీమ, ముచ్చుమర్రి,పురుషోత్తమ పట్నం పోర్ట్, కృష్ణ, గోదావరి,పెన్నానదుల అనుసంధానం,కొండవీటి వాగు ప్రాజెక్టు పనులను మేఘా కృష్ణారెడ్డి కి అప్పజెప్పాడు చంద్రబాబు. 2016 జూలై 6 న ఘనంగా పట్టిసీమను ప్రారంభించాడు. పట్టి సీమను సకాలంలో పూర్తి చేసినందుకు మేఘా కృష్ణా రెడ్డిని కూడా భారీ బహిరంగ సభ పెట్టి సన్మానించాడు చంద్రబాబు. పట్టిసీమ పనులు జరిగినప్పుడు చైనా మోటర్స్ తో ,చైనా టెక్నాలజీ తో ప్రాజెక్ట్ పూర్తి చేసామని ఘనంగా చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మారిన వెంటనే చైనా మోటర్స్ పైనా , ఆ టెక్నాలజీ వల్ల రాష్ట్రానికి ఏదో నష్టం జరుగుతుందన్న బిల్డప్ ఇస్తూ అభివృద్ధి పనులపై మళ్లీ యూటర్న్ లు తీసుకోవడం వంటి హేయమైన చర్య ఆయనకే చెల్లిందని పారిశ్రామిక వేత్తలు విమర్శిస్తున్నారు.

ఇక రాష్ట్రం లో పెట్టుబడులు కోసం ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి చైనా, జపాన్,సింగపూర్, మలేషియా లలో తిరిగి అక్కడి టెక్నాలజీ తో ఏపీని సింగపూర్ చేస్తానన్న బాబు ఇప్పుడు కేవలం చైనా మోటర్ల విషయంలో తెలివి తక్కువగా మాట్లాడటం అందరిని విస్మయపరుస్తోంది. చైనా ప్రభుత్వం సహాయంతో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టెక్నాలజీ తో రాజధాని భవనాలను నిర్మిస్తున్నామని చైనా లో ప్రెస్‌ మీట్ పెట్టి మరి చెప్పాడు..చైనా ప్రతినిధులకు కూడా అమరావతి వచ్చి వెళ్లిపోయారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కంపెనీలు మాత్రం ఐదేళ్లలో‌ నయాపైసా పెట్టుబడి పెట్టలేదు. ఇక పట్టిసీమతో పాటు ముచ్చుమర్రి,పురుషోత్తమ పట్నం పోర్ట్, కృష్ణ, గోదావరి,పెన్నానదుల అనుసంధానం,కొండవీటి వాగు లాంటి ప్రాజెక్టులు దాదాపు 38వేల కోట్ల రూపాయలు మేఘా కృష్ణారెడ్డి కి కట్టబెట్టాడు చంద్రబాబు అప్పుడు పట్టిసీమను పూర్తి చేసినందుకు గాను సన్మానాలు జరిపిన మాజీ సీఎం చంద్ర బాబు ఇప్పుడు మేఘా కంపెనీ పై విశాఖపట్నం లో మాటాడిన తీరు ఆయన దుర్మార్గపు రాజకీయాన్ని బయటపెట్టినట్టైంది. ఈ విషయంలో మరో యూటర్న్ తీసుకున్నాడు. తన పచ్చమీడియా ,సోషల్ మీడియా భజన బృందాలతో పారిశ్రామికవేత్త లపై విషం కక్కిస్తూ మోసగించడంలో కొత్త యూటర్న్ తీసుకున్నాడు.

ఇప్పుడు ఈ పరిణామాలన్నీ చూశాక చంద్రబాబును యూటర్న్ కు అంబాసిడర్ గా చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. బాబు కు యూటర్న్ లు కొత్తకాదు..యూటర్న్ కు బాబు కూడా కొత్త కాదు. అయితే నిజాన్ని చెప్పే అలవాటు ఏ రోజు చంద్ర బాబుకు అలవాటు లేదన్నది జనమెరిగిన సత్యం.. నాలుగునెలలకే తన అనుభవాన్ని ఉపయోగించి తిమ్మిని బమ్మిని చేసే చంద్రబాబు ఎప్పుడు ఏ యూటర్న్ తీసుకున్నా అది తన లాభానికే,పచ్చ జాతికి తప్ప జనానికి ఉపయోగపడేది కాదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం పడుతున్నారు

యూటర్న్ అనేపదం కూడా తన వ్యక్తిత్వాన్ని ,సహజత్వాన్ని‌ వదులుకునేలా చంద్రబాబు ప్రవర్తిస్తుండటంతో ఇప్పుడు రోడ్లపై యూటర్న్ లు మాయమై బాబు ఫోటోలతో నిండిపోవడం ఖాయమని సెటైర్లు పడుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -