Friday, April 19, 2024
- Advertisement -

చంద్రబాబు హాయిగా కృష్ణ రామ అనుకుంటున్నారా..?

- Advertisement -

చంద్రబాబు రాజకీయ నిబద్ధత ఎలా ఉంది అంటే అయన ఏపీలో ఎమ్మెల్యే అయితే పక్కరాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి జూమ్ రాజకీయాలు, ట్విట్టర్ పాలిటిక్స్ చేస్తూ కృష్ణా రామా అనుకుంటున్నారు.. ఓ వైపు అధికార ప్రభుత్వం ప్రజలకు కరోనా సమయంలో అండగా ఉంటే చంద్రబాబు మానవాళికి దూరంగా ప్రశాంత మైన వాతావరణంతో మనవడితో ఆడుకుంటున్నట్లుగా ఉంది.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని ఆంక్షలపై నిబంధనలను ఎత్తివేసింది. కొన్ని జనసందోహాలు ఉండే ప్రాంతాలు తప్పా అన్ని ఓపెన్ చేసింది.. దాంతో మళ్ళీ జనాలు రోడ్ల మీద కనపడడం మొదలు పెట్టారు..

అయితే సామాన్యుడు సైతం బయటకి వచ్చి తన కార్యకలాపాలు చేసుకోవడంతో పాటు ఇతరులకు హెల్ప్ చేస్తున్నాడు కానీ చంద్రబాబు మాత్రం ఇంకా తన భవనాన్ని వీడి రాకపోవడం తో ఏపీ ప్రజలు దేశంలో అందరికి అన్ లాక్ అయినా చంద్రబాబు కు మాత్రం కాదు అని సెటైర్లు వేస్తున్నారు.. ఇదేవిషయం రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రజలు కరోనా కష్టంలో ఉంటే వారిని ఆదుకోవడం మానేసి పక్కరాష్ట్రంలో కూర్చున్నారని ప్రత్యర్ధులు ఎంతగా విమర్శలు చేసినప్పటికీ చంద్రబాబు చలించలేదు. ఏపీలో అడుగు పెట్టనూలేదు. ఒకసారి విశాఖలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో అమరావతికి వచ్చి జూమ్‌ మహానాడు నిర్వహించుకుని, వెంటనే హైదరాబాదుకు చేరుకున్నారు.

సొంత నేతల మాటలు కూడా చంద్రబాబు వైన్ పొజిషన్ లో లేదు.. ఇలానే ఉంటే టీడీపీ ని ప్రజలు మర్చిపోయే ప్రమాదం ఉందని టీడీపీ నేతలు ఫోన్ లో ఎంత మొత్తుకున్నా బాబు కు కనీసం చీమ కుట్టినట్లు లేదు. సరే చంద్రబాబు పెద్దాయన కాబట్టి బయటకి రావడం లేదనుకోవచ్చు..మరి లోకేష్ కి ఏమైంది. అతను బయటకి రాకపోవడం పట్ల కూడా చాలా విమర్శలు వచ్చాయి.. అయినా ఇద్దరు ఇంట్లో వీడియో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు..  కేంద్రప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిభందనలు వందకి వంద శాతం పాటించిన భారత పౌరులు ఎవరైనా ఉన్నారంటే వారు ఈ తండ్రి కొడుకులు అని మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్రానికి ఎప్పుడొస్తారు అని టీడీపీ , వచ్చినా రాకున్నా పెద్ద ఒరిగేదేమి లేదని వైసీపీ పార్టీ లు అనుకుంటున్నాయి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -