Friday, April 26, 2024
- Advertisement -

జగన్ అనుకున్నది బాబు ఇప్పట్లో చేయనిచ్చేలా లేడే..?

- Advertisement -

రాష్ట్రం విడిపాయి దాదాపు 7  సంవత్సరాలు కావస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో ఏది రాజధాని అన్నది ఇంకా క్లారిటీ రాకపోవడం ప్రజలను కలిచివేస్తుంది.. ఇతర రాష్ట్రాలు రాజధాని ని కేంద్రం చేసుకుని అభివృద్ధి దిశగా సాగిపోతుంటే ఏపీలో నేతలు మాత్రం ఇంకా ఒకరినొకరు విమర్శించుకుంటూ కోర్టు లో కేసులు వేసుకుంటున్నారు అని ప్రజలు వాపోతున్నారు.. ఇప్పటికే తెలంగాణ నుండి విడిపోయి భారీ మూల్యం చెల్లించుకున్న ఏపీ తొందరగా రాజధాని ని నిర్మించుకుని అభివృద్ధి బాటలో సాగాలని కోరుకుంటుండగా ఇప్పటివరకు రాజధాని ఏది అని ప్రజలలో అసహనం నెలకొంది..

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అమరావతి ని రాజధాని గా ప్రకటించారు కానీ జగన్ వచ్చి రాగానే దాన్ని మర్చి విశాఖ పట్నం కి మార్చారు. అయితే మార్చినప్పుడు ఊరుకోక చంద్రబాబు అమరావతి లోనే ఉంచాలని రాజధాని ని ఎక్కడా ఉండనీయకుండా చేస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 90 శాతం మంది రాజధాని తరలింపు కే మొగ్గు చూపుతున్నారని చంద్రబాబు తన సొంత ప్రయోజనాలకొసం ఇలా ఆ ప్రాంతాన్ని రెచ్చగొట్టే రాజకీయాలు చేయడం రాష్ట్రానికి మంచిది కాదని అంటున్నారు. ఇక జగన్ విశాఖ రాజధాని నెలకొల్పే ప్రయత్నం ఆయన్ని నిరాశ పరిచే ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు చేయడం తో ఆయనపై కొంత ఆగ్రహంగా కూడా చంద్రబాబు ఉన్నారని తెలుస్తుంది.

మూడు రాజధానుల ప్రతిపాదానను ఈ ఏడాది జనవరి నెలలో ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. దాంతో ప్రభుత్వానికి ఇచ్చిన భూములపై రైతులు కేసులు నమోదు చేశారు..ప్రస్తుతం హైకోర్టులో విచారణ సాగుతోంది. ఈ కేసు తేలే వరకు విశాఖ లో రాజధాని నిర్మాణం జరగదని కోర్టు వెల్లడించగా త్వర గా ఎదో ఒకటి తేల్చాలని చెప్తున్నా రోజుకో కొత్త పిటీషన్లు పడుతుండటంతో జాప్యం జరిగే అవకాశముంది. తీర్పు ఏమాత్రం తేడా వచ్చినా హై కోర్టు లో  కేసు కాస్త సుప్రీం కోర్టు కు కూడా వెళ్తుందట..దీంతో అమరావతి కథ ఇప్పట్లో తేలేలా లేదు. వాస్తవానికి దసరాకు జగన్ విశాఖలో పరిపాలన రాజధానిని ప్రారంభించాలని భావిస్తున్నారు.  ఈ నేపథ్యంలో రాష్ట్ర భవిష్యత్ ఇంకెన్నాళ్లు పెండింగ్ లో ఉంటుందో ఏమో..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -