Thursday, April 25, 2024
- Advertisement -

ఇన్ చార్జ్ ల విషయంలో చంద్రబాబు ఇలా చేశాడేంటి.?

- Advertisement -

ఒకప్పుడు చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకుంటే దానికి తిరుగు ఎదురు ఉండేది కాదు.. ఆ నిర్ణయం కూడా అందరికి సత్ఫలితాలు ఇచ్చేది.. దాంతో టీడీపీ పార్టీ భవిష్యత్ కు చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారు అని తెగ పోగిదేశేవారు.. ఇప్పుడు అదే వ్యక్తి తీసుకున్న నిర్ణయాల పట్ల చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ఎందుకు ఇంత అవుట్ డేటెడ్ నిర్ణయాలు తీసుకుంటున్నాడని పొగిడిన నోళ్లే తప్పుపడుతూ ఉండడం చంద్రబాబు లో మునుపటి జోష్ కనపడటం లేదు.. ఇక తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పై అందరిలో పొగడ్తలకంటే విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి..

రాష్ఱ్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులను నియమించారు. గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తల ప్రకారం సోషల్ మీడియా చక్కర్లు కొట్టిన వారి పేర్లే చంద్రబాబు ఫైనల్ చేసి ఎక్కువ రిస్క్ తీసుకోలేదు.. అయితే ఇందులో చాలామంది జనాలకు తెలియని వారిని ఎంపిక చేసి అక్కడే మైనస్ అయ్యారని ఆయా నియోజక వర్గ ప్రజలు అనుకుంటున్నారు.. వీరిలో నోరున్న నేతల పేర్లు ఎక్కువగా లేవని చెప్పాలి.. కూనరవికుమార్, జవహర్, కొనకళ్ల నారాయణ, శ్రావణ్ కుమార్, కాల్వ శ్రీనివాసులు, డీకే పార్థసారధి వీరు తప్పా అందరు మెతకగా మాట్లాడేవారే.. వైసీపీ పార్టీ నేతలు గట్టిగా ఒక్కమాట అంటే వీరు ఇండ్లకే పరిమితమవుతారు..

ఇక కొన్ని పార్లమెంటరీ నియోజక వర్గాల్లో ప్రజాభిమానం కోల్పోయిన వారిని ఎంపిక చేసి ప్రజల ఆసక్తి ని నిరాశపరిచాడు. కాకినాడ పార్లమెంటరీ బాధ్యతలను యువనేత జ్యోతుల నవీన్ కు అప్పగించారు. అదే సమయంలో రాజమండ్రి బాధ్యతలను కొత్తపల్లి జవహర్ కు కట్టబెట్టారు. ఇక విజయవాడ పార్లమెంటు చూసుకుంటే అవుట్ డేటెడ్ నేత నెట్టెం రఘురాంకు అప్పగించడంపై పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అనంతపురానికి ఊహించినట్లే మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను నియమించారు. హిందూపురం నియోజకవర్గానికి బీకే పార్థసారధిని నియమించారు. ఇక నంద్యాల పార్లమెంటును గౌరు వెంకటరెడ్డికి అప్పగించడం కూడా పార్టీ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ మెరుగుపడేదానికంటే పతనమవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటున్నాయి..

అసెంబ్లీ సమావేశాల వేళా చంద్రబాబు కి బిగ్ షాక్ ఇవ్వనున్న జగన్..?

సొంత పార్టీ లోనే చంద్రబాబు కు వ్యతిరేక కూటమి తయరైందా..?

చంద్రబాబు అలా చేస్తే జగన్ ఇలా వరం అయిపోతుంది..?

తిన్నింటి వాసాలను లెక్కపెడుతున్న టీడీపీ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -