Saturday, April 20, 2024
- Advertisement -

అనవసరపు అరుపులు ఎందుకు చంద్రబాబు..?

- Advertisement -

చంద్రబాబు అనవసరపు విమర్శలు ఎలాంటి దారుణానికి తీస్తాయో తెలీదు కానీ అయన చేసే వ్యాఖ్యలపై మాత్రం ప్రజలు చాలా కోపంగా ఉన్నారు.. వాస్తవానికి టీడీపీ పార్టీ గతంలో ఎప్పుడూలేని డిఫెన్సివ్ సిచువేషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.. చంద్రబాబు మానసిక పరిస్థితి ఎలా ఉందొ తెలీదు కానీ వచ్చే ఎన్నికలనాటికి అయన ఓల్డ్ ఏజ్ తో మానసిక పరిస్థితి కూడా కొంత ఆందోళన కరంగా ఉంటుందన్నది మాత్రం అందరు గ్రహిస్తున్న విషయం.. పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు జగన్ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తన పార్టీ లోకి వచ్చే నేతలను కాదనకుండానే రాజీనామా పద్ధతిని ముందర పెడుతున్నారు.. అయితే ఆ వచ్చే నేతలు రాజీనామాకు పెద్దగా ఇష్టపడకపోయినా తమ కుటుంబ సభ్యులను చేర్చి చాలా సాప్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు..

ఈ క్రమంలోనే త‌న‌కు అవ‌స‌రం లేకున్నా టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల‌ను త‌న చెంత‌కు చేర్చుకున్నారు. అయితే గతంలో చంద్రబాబు చేసిన విధంగా కాకుండా ప్రజలు గమనిస్తున్నారన్న అంశం పరిగణలోకి తీసుకుని ఎంతో పారదర్శకంగా అయన ఆ నేతలను తన పార్టీ లో చేర్చుకున్న విధానం చూసి ప్రజలు కొత్త తరహా రాజకీయం చేస్తున్న జగన్ ను పొగడకుండా ఉండలేకపోతున్నారు.. ఇక ఇప్పుడు మ‌రో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని టాక్ వినిపిస్తోంది.  ఉత్తరాంధ్రలో ఓ ఇద్దరు నేతలు వైసీపీ లోకి రావడానికి ఎంతో ఉవ్విళ్లూరుతున్నారని తెలుస్తుంది.

అయితే జరిగిన ప్రతిఘటనను తమకు మైలేజీగా వాడుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే చంద్రబాబు జాతీయ స్థాయి నాయకుడిగా అనుంగు మీడియా ఇచ్చిన కలరింగ్‌ ఇప్పుడు లేదు. అక్కడెక్కడో చక్రం తిప్పడం మాట అటుంచితే ఉభయ తెలుగురాష్ట్రాల్లోనూ, ఆ మాటకొస్తే ఏపీ ఒక్కచోటా కూడా అంతంత మాత్రంగానే చక్రం తిరుగుతోంది. ఉదయం కాగానే రాష్ట్రంలో ఏ పక్క నుంచి నాయకుడు పక్కపార్టీకి జారిపోతాడో అనే శంకతోనే నిద్ర లేవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటప్పుడు చౌకబారు ఆరోపణలు పదేపదే చేసే బదులు సరైన సమస్యను, తగు ప్రణాళికతో లేవనెత్తి ప్రజల ముందుకువెళితే తప్ప చంద్రబాబు, టీడీపీలను గురించి జనం ఆలోచించే పరిస్థితి ఉండదని విశ్లేషకులు బలంగానే విశ్వసిస్తున్నారు.

వారిని రమ్మని జగన్ ఇన్ డైరెక్ట్ గా చెప్తున్నాడా..

చంద్రబాబు ఇంకా ఆ సూత్రాన్ని ఫాలో అవుతున్నాడేంటి..?

రాష్ట్రానికి చంద్రబాబు ఇప్పుడొచ్చి ఏం చేద్దామని..?

మరోసారి వారికి చంద్రబాబు తన స్టైల్ లో వెన్నుపోటు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -