Thursday, March 28, 2024
- Advertisement -

కోడెల మృతి వివాదంలో అడ్డంగా బుక్ అయిన చంద్రబాబు…?

- Advertisement -

రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు చేస్తున్న అన్న ప్రయత్నాలు రివర్స్ అవుతున్నాయి. ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని బాబు తాపత్రయ పడుతున్నారు. ఎందుకంటే ప్రత్యర్ధులపై బురద చల్లటమే రాజకీయంగా, ఎదుటి వాళ్ళని గబ్బు పట్టించటమే ధ్యేయంగా రాజకీయాలు చేస్తారు కాబట్టి. తాజాగా కోడెల ఆత్మహత్య కేసులో జగన్ ను ఇరుకున పెట్టాలని రెండు రోజులుగా బాబు చేస్తున్న డ్రామాలు అన్ని ఇన్నీ కావు. అయితే ఇప్పుడు అన్ని చేతులు బాబు వైపు చూపిస్తున్నాయి.

నిజానికి అసెంబ్లీ ఫర్నీచర్ దొంగతనం కేసు విషయంలో పడిన కేసు తప్ప మరోటి లేదు కోడెలపై. అవన్ని చిన్న కేసులే. కోడెల కొడుకు,కూతురుపై కూడా టీడీపీ నేతలే కేసు పెట్టారు. ఆకేసుల్లో ఇప్పటికే ముందస్తు బెయిల్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.కానీ చంద్రబాబు అండ్ కో మాత్రం కోడెలపై ప్రభుత్వం 19 కేసులు పెట్టిందని, మానసికంగా వేధించిందని, మానసిక క్షోభను తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఒకటే గగ్గోలు పెట్టేస్తున్నారు.

చంద్రబాబు అండ్ కో చేస్తున్న శవరాజకీయాలు అందరికీ తెలిసిపోతోంది. చంద్రబాబు చేస్తున్న శవ రాజకీయాలతో టిడిపి నేతలే మండిపోతున్నారు. అందుకనే క్రియాశీలక సభ్యుడు అన్నపురెడ్డి నర్సిరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.అదే సమయంలో బిజెపి సీనియర్ నేతలు పురిపళ్ళ రఘురామ్, లక్ష్మీపతి రాజు కూడా చంద్రబాబుపై మండిపోతున్నారు.

చంద్రబాబు వల్లే తాను మానసిక క్షోభ అనుభవించినట్లు తమతో కోడెల చెప్పుకుని బాధపడినట్లు చెప్పటం సంచలనంగా మారింది. చంద్రబాబు వైఖరి వల్లే తాను టిడిపిలో ఒంటరివాడిని అయిపోయినట్లు కోడెల బాధపడ్డారని వీళ్ళు చెప్పటంతో చంద్రబాబు రాజకీయమంతా రివర్సవుతోంది.బాబు తీరు నచ్చకే కోడెల బిజెపిలో చేరాలని డిసైడ్ చేసుకున్నట్లు వీళ్ళు చెబుతున్నారు. మరి వీరి మాటలకు బాబు ఎలా సమాధాని మిస్తారో…? అంతేకాదు కోడెల మరణంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా నిషేధం విధించిన బాబు ఇప్పుడ సీబీఐ విచారణ కోరడం ఆయనకే చెల్లుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -