చంద్రబాబు ప్రెస్ మీట్ అంటే భయపడుతున్న టీడీపీ నేతలు..?

1060
chandrababu press meet tdp leaders stay away
chandrababu press meet tdp leaders stay away

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ప్రజలే కాదు.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు కూడా పారిపోతున్నారట. వెంటనే బాబు పక్క నుండి దూరం వెళ్తున్నారట. ఇక టీవీలో వస్తే ఛానెల్ మార్చేస్తున్నారట. దీనికంతటికి చంద్రబాబు ఊదరగొట్టే.. నసపెట్టే సుధీర్ఘ ప్రసంగాలే కారణమని ప్రచారం జరుగుతుంది. బాబు మాటలు తప్పిస్తే చేసేది ఏం లేదని టీడీపీ వర్గాల వాదన.

చంద్రబాబు ఆవేదన, ఆగ్రహం తప్ప ఏమీ సాధించలేడు అని వారంతా అనుకుంటున్నారట. అమరావతి కోసం పోరాటం చేదామని పిలిచిన టీడీపీ నేతలు వెళ్ళడం లేదట. అమరావతి కోసం పోరాటం చేయలేమని కొందరు టీడీపీ నేతలు అంటుంటే.. మరి కొందరు రోడ్లపైకి వెళ్లకుండా ప్రెస్ మీట్లతోనే నిరసన తెలుపుదామని మరికొందరు అంటున్నారట. చాలా మంది టీడీపీని నమ్ముకొని విలువలతో బతికే నాయకులు చంద్రబాబు ఆదేశానికి మౌనంగా ఏం చేయాలో పాలుపోక అసహనం వెళ్లగక్కుతున్నారట.. కొందరేమో కక్కలేక మింగలేక ఉంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఒక అడుగు ముందుకేసి కేవలం మీడియా సమావేశాల ద్వారా ఏమీ సాధించలేరని ఖరాఖండీగా కుండబద్దలు కొట్టారు.

బాబు, లోకేశ్ జూప్ యాప్ లో కాకుండా వీధుల్లోకి వచ్చి ఫైట్ చేయాలని స్పష్టం చేశారు. మీడియా ప్రెస్ మీట్ లతో ఏం సాధించలేరని దెప్పపొడిచాడు. చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా కేశినేని ట్వీట్ చేసినట్టు అర్థమవుతోంది. గతంలో కూడా కేశినేని నాని తన కంటే అనుభవం తక్కువ ఉన్న ఎంపీలకు పార్టీ పార్లమెంటరీ నాయకత్వాన్ని చంద్రబాబు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. నాని గత కొన్ని నెలలుగా తక్కువ ప్రొఫైల్‌ను పాటిస్తున్నారు. టీడీపీ ఫైట్ చేయాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం జూమ్ లోనే ఉద్యమాలకు పిలుపునివ్వడాన్ని అందరిలా ఆయన సహించక ఓపెన్ గానే బాబుకు సవాల్ విసిరారు.

చంద్రబాబుకు జలక్ ఇస్తున్న తెలుగు తమ్ముళ్లు..!

వైసీపీలో చేరుతా.. కానీ ఆ పని చేయాలి : జేసీ సంచలన వ్యాఖ్యలు

జగన్ సర్కార్ కొత్త నిర్ణయం.. కరోనా రోగి వద్ద కాలింగ్‌ బెల్‌.. !

జగన్ హ్యాపీ ఫీల్ అయ్యే విషయం చెప్పిన చిరు, సురేష్ బాబు..!

Loading...