Friday, April 19, 2024
- Advertisement -

చంద్రబాబు కు ఏమాత్రం ఉన్నా దీనిపై ఉద్యమం చేయాలి.. ?

- Advertisement -

చంద్రబాబు ఏమాత్రం మర్యాద ఉన్నా దీనిపై ఉద్యమం చేయాలి అని సోషల్ మీడియా లో ఓ వార్త సెన్సేషనల్ అవుతుంది.. ఏపీలో ప్రస్తుత పరిస్థితి గురించి అందరికి తెలిసిందే. కరోనా ని దానిమానాన దాన్ని వదిలేశారు.. మూడు రాజధానులను అందరు అంగీకరించే దశకు వచ్చేశారు.. మరోవైపు సంక్షేమ పథకాలు జోరుగా సాగుతున్నాయి.. ఈ క్రమంలో సీఎం జగన్ ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. అదే జిల్లాల పెంపు.. రాష్ట్రంలో ఇప్పుడున్న 13 జిల్లాలను  26 జిల్లాలు పెంచాలని జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి అందరికి తెల్సిందే..

ఈ క్రమంలో కొత్తగా ఏర్పడే జిల్లాలకు, ఇప్పటికే జిల్లాలుగా ఉన్న జిల్లాలకు తమ ప్రాంతపు అమరవీరుల పేర్లు పెట్టాలని డిమాండ్ కొనసాగుతుంది.. జగన్ కూడా కొన్ని జిల్లాలకు ఎన్నికల సమయంలో ఆయా ప్రాంతపు అమరవీరుల పేర్లు పెడతానని వాగ్దానం చేశారు. అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ వంటి మహనీయుల పేరులు జిల్లాలకు పెడతామని ప్రజలకు మాటిచ్చారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని , దివంగత పీవీ నరసింహ రావు పేరు ను కూడా ఏదైనా జిల్లాకు పెట్టాలనే కొత్త డిమాండ్ వస్తుంది..

అయితే పీవీ ఆంధ్రప్రదేశ్ వారు కాదు, అయన తెలంగాణ మనిషి.. అలాంటిది ఇలాంటి డిమాండ్ రావడం కొంత ఆశ్చర్యం కలిగించినా దానికి కారణం చూస్తే పెట్టాలని డిమాండ్ రావడం మంచిదే అనిపిస్తుంది.. అయన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడ్డారు అని కారణాలు చెప్తున్నారు. ఇక ఈ విషయంలో చంద్రబాబు ముందుపడాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు కి ఎన్టీఆర్ వెన్నుపోటు విషయంలో పీవీ చేసిన సహాయం అలాంటిది.. ఎన్టీఆర్ కి పీవీ కి ఎంతో స్నేహం ఉన్నా మామ అల్లుళ్ళ వ్యవహారంలో మౌనంగానే ఉన్నారు.. అప్పటి గవర్నర్ తో కూడా రాజ్యాంగం ఎలా ఉంటే అలాగే కానివ్వండి అని చెప్పారట.. దాంతో చంద్రబాబు కి పరోక్షంగా పీవీ నుంచి సపోర్ట్ దక్కిందని అంటున్నారు.. ఆవిధంగా చూస్తే చంద్రబాబు కి ఏమాత్రం మర్యాద ఉన్నా దీనిపై ఉద్యమం చేసైనా సరే జగన్ ని ఒప్పించాలని కొందరు పీవీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -