Friday, April 26, 2024
- Advertisement -

షాకింగ్….. చరిత్రలో ఎప్పుడూ చూడని ఓటమి ఖాయం అని ముఖ్యనేతతో చెప్పిన బాబు

- Advertisement -

చంద్రబాబు నాయుడి తీరే అంత. పదవీ వ్యామోహం, కుర్చీ కోసం కొట్లాట లాంటి విషయాల్లో వచ్చే ఐదేళ్ళ కాలానికి తగ్గట్టుగా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తాడు. ఇప్పుడు కూడా అలాంటి వ్యూహమే రచించాడు బాబు. అందుకే ఈవిఎంలపై రెచ్చిపోతున్నాడు బాబు. అయితే అసలు విషయాన్నీ ఆ పార్టీ ముఖ్యనేతనే మీడియాకు లీక్ చేశాడు.

ఫ్రస్ట్రేషన్‌తో చంద్రబాబు ఊగిపోతున్నారంటేనే ఫలితాల మీద చంద్రబాబుకి ఏ స్థాయిలో అనుమానం వుండి వుండాలి అన్న విషయం తెలిసిపోతోంది. ఓ టీడీపీ ముఖ్య నేత మీడియాకి అందించిన తాజా లీక్‌ సారాంశమేంటంటే తెలుగుదేశం పార్టీ అర్థ సెంచరీ దాటడం కూడా కష్టమే అని చంద్రబాబు స్వయంగా చెప్పాడట. ఇప్పటికే చాలా సర్వేలు ఈ విషయం చెప్పినప్పటికీ చంద్రబాబు నోట నుంచీ స్వయంగా చెప్పడంతో ఆ టిడిపి సీనియర్ నాయకుడితో పాటు ఇతర నేతలు కూడా షాక్ తిన్నారట. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన సదరు ముఖ్య నేత ‘లీక్‌’ చేసిన ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈ ఫలితం ఎన్నికల పోలింగ్‌కి ముందే చంద్రబాబుకు పూర్తిగా అర్థమయిందట.

అందుకే చంద్రబాబు పోలింగ్‌ని ఎంతగా విమర్శించాలో అంతా చేస్తున్నారట. 2014 ఎన్నికల్లో చాలా తక్కువ ఓట్లతో బాబు అధికారంలోకి వచ్చాడు…………..కాస్త కష్టపడితే 2019లో అధికారం మనదే అని ఐదేళ్ళుగా వైకాపాను సమర్థవంతంగా కాపాడుకోగలిగాడు జగన్. కానీ ఈ సారి చంద్రబాబు ఘోరంగా ఓడిపోతూ ఉండడంతో బాబుకు అలాంటి ఛాన్స్ లేదు. అందుకే ముందు జాగ్రత్తగా ఈవీఎంలపై ఓటమిని నెట్టేయాలని ఫిక్స్ అయ్యాడట. ప్రజలంతా టిడిపి వెనుకే ఉన్నారు…..కానీ ఈవీఎంల మోసం వళ్ళ ఓడిపోయాం……………నాయకులు డీలాపడవద్దు…………..2024 ఎన్నికల్లో మనమే గెలుస్తాం….అని టిడిపి తమ్ముళ్ళను నమ్మించాలన్నది చంద్రబాబు అసలు లక్ష్యమట. ఈ లక్ష్యంతోనే ప్రతి రోజూ ఎన్నికల కమిషన్‌ని తిడుతూ తన స్థాయిని తానే తగ్గించుకుంటూ ఉన్నాడు చంద్రబాబు. అయితే ఎన్టీఆర్ వెన్నుపోటు టైంలో సోషల్ మీడియా లేదు కాబట్టి బాబు బ్రతికిపోయాడు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని అన్ని నిజాలూ బయటికి వచ్చేస్తున్న టైంలో ఓటమిని ఈవీఎంలపైకి నెట్టేసి తెలుగు తమ్ముళ్ళను చంద్రబాబు నమ్మించగలడా? చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -