Friday, April 26, 2024
- Advertisement -

చంద్రబాబు కి మరో షాక్.. ఇది కూడా ఫలించకపాయే..?

- Advertisement -

రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ఆ నేతల పరిస్థితి కూడా అలానే తయారవడం ఇప్పుడు టీడీపీ ని కలవర పెడుతుంది. పార్టీ లో ఎలాంటి కార్యకలాపాలు జరగకపోవడం తో పాటు టీడీపీ నేతలు కూడా మిన్నకుండి పోవడం తో టీడీపీ భవిష్యత్ ఎలా ఉంటుందో అని వాపోతున్నారు.. ఇక పార్టీ లోని చినబాబు, పెదబాబు లు మాత్రమే టీడీపీ కొంత హుషారుగా ఉండేందుకు కృషి చేస్తున్నారు.. అది కూడా సోషల్ మీడియా లోనే.. ఓడిపోయిన తరువాత వీరు ఎక్కువగా ట్విట్టర్ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తుండడంతో ప్రజలు కూడా వారిని అలానే ఫాలో అవడం మొదలుపెట్టారు..

రాష్ట్రాభివృద్ధి లో భాగంగా జగన్ మూడు రాజధానులను సృష్టించి అమరావతి ప్రజలకు ద్రోహం చేశాడని టీడీపీ వర్గాలు అమరావతి లో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వైసీపీ ఇప్పుడు అవన్నీ ఒట్టి అపోహలు, టీడీపీ తమ రాజకీయ ఉనికిని చాటడానికి ఇలా అబద్ధపు ప్రచారకం చేస్తున్నారు అని చెప్తూ అమరావతి ప్రజలను అక్కున చేర్చుకునేది తమ ప్రభుత్వం అని చెప్తున్నారు.. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం అక్కడి ప్రజలకు తమ తరపున భరోసా ఇచ్చేనందుకు సిద్ధమయినట్లు తెలుస్తుంది.. వాస్తవానికి అమరావతి లో పోరాటం చేసేది రైతులు కాదు టీడీపీ నుంచి లాభం పొందిన కొందరు భూబకాసురులు అని వైసీపీ వారు భావిస్తున్నారు..

ఇక పార్టీ ని గాడిలో పెట్టడానికి టీడీపీ చేయని పని లేదు.. అమరావతి ని ఆయుధంగా చేసుకుని వారు రాజకీయాలు కొనసాగిస్తుండగా అమరావతి ఉద్యమానికి ఇటీవలే 300 పూర్తి కాగా రాష్ట్రమంతటా ఉద్యమానికి మద్దతుగా మూడు రోజుల కార్యక్రమాలు చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. కానీ చంద్రబాబు పిలుపుకి ఏ ఒక్కరు స్పందించట్లేదు. కొత్తగా పదవులు పొందిన వాళ్ళు గానీ, టీడీపీ తరపున ప్రజా ప్రతినిధులుగా ఉన్న వాళ్ళుగానీ, ఇటీవలే పార్లమెంట్ ఇంచార్జి లు గా పోస్ట్లు పొందిన వారు కానీ ఎవరు చంద్రబాబు మాటను ఖాతరు చేయట్లేదట.. వచ్చిన వాళ్ళు కూడా ఏదో ఫోటోలు, వీడియోల వరకు మాత్రమే మమ అనిపించేసి అక్కడ్నుంచి నెమ్మదిగా జారుకున్నారు. దీంతో ఏ ఉద్దేశ్యంతో అయితే చంద్రబాబు ఈ కార్యాచరణ ప్రకటించారో దానికి దూరంగానే కార్యక్రమం జరిగిపోయిందంటున్నారు. మరి పార్టీ బలపడడానికి చంద్రబాబు చేసిన ఈ ప్రయోగం కూడా ఫెయిల్ అయ్యింది.. ఇంకెన్ని ఎత్తులు వేస్తారో చూడాలి..

గంటా గురి మంత్రి పదవికే..!

రాజు గారు ఇప్పుడెలా మరీ…!

చంద్రబాబు 40 ఇయర్స్ రాజకీయం ఇదేనా…?

చంద్రబాబు ఇలాంటి రాజకీయాలు ఎవరికోసం..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -