Saturday, April 20, 2024
- Advertisement -

ఛీ. పొమ్మన్న చంద్రబాబు బీజేపీ చెంతకే వెళ్తున్నాడంటే.?

- Advertisement -

ఇటీవలే జరిగిన ఎన్నికల సమయంలో చంద్రబాబు కి, బీజేపీ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేసిన పోరాటానికి మోడీ భయపడి చంద్రబాబు ను దూరం పెట్టాడని అప్పట్లో చంద్రబాబు చెప్పిన వ్యాఖ్యలు విని ఆయనకు ఓటు వేయబోయారు ప్రజలు కానీ మరొకసారి చంద్రబాబు ను నమ్మకపోవడమే మంచిది అయ్యింది. వాస్తవానికి చంద్రబాబు అండ్ కో బీజేపీ పై చిన్న పాటి యుద్ధం చేశారని చెప్పొచ్చు.. ప్రత్యేక హోదా ఇస్తారా చస్తారా అన్న నినాదాన్ని జనాల్లోకి బాగా తీసుకెళ్లగలిగారు.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్న సూక్తిని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు కానీ ప్రజలు నమ్మనట్లే మోడీ కూడా చంద్రబాబు ను నమ్మి ప్రత్యేక హోదా ఇవ్వలేదు..

ఆ తర్వాత ఎన్నికల్లో బాబు ఓటమి, సెంట్రల్లో బీజేపీ విజయం తో ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి.. వేరే ప్రభుత్వం వచ్చినా మోడీ కి ఆంధ్రపై ఇంకా ప్రేమ రాలేదు.. ప్రత్యేక హోదా ఇవ్వలేదు.. ఈ విషయంలో మోడీ వైఖరి ఎలా ఉందొ తెలుసుకోవాలంటే ఒకటి కాంగ్రెస్ అయినా అధికారంలోకి రావాలి.. రెండోది మోడీ కైనా విసుగు వచ్చేలా ఉద్యమం చేయాలి.. ఈ రెండు కావాలంటే చాలా సమయం పడుతుంది.. అయితే అయిపోయిందేదో అయిపోయిందని చంద్రబాబు ఇప్పుడు బీజేపీ భజన చేస్తూ వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు..  తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్ధతు ప్రకటించడం ద్వారా ఒకవైపు తన పరువు నిలుపుకునే యత్నం, రెండో వైపు బీజేపీ అధిష్టానానికి చేరువయ్యే మార్గం దక్కుతుందని చంద్రబాబు ఆశిస్తున్నారు.  చంద్రబాబు ప్లాన్ అయితే బాగుంది కానీ తాము అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ కి టీడీపీ మద్దతు ఎక్కడ అవసరమొస్తుందనేది చూడాలి..

టీడీపీని ఖాళీ చేసి అర్జెంట్ గా రెండో స్థానానికి చేరాలని బీజేపీ ఆశిస్తోంది. దానికి అనుగుణంగా బీజేపీ కార్యాచరణ సాగుతోంది. అలాంటి సమయంలో ఉప ఎన్నికల్లో టీడీపీ పక్కకు తప్పుకోవడం ద్వారా నేరుగా బీజేపీకి ఆ స్థానం దక్కినట్టే అవుతుందని అంచనా వేస్తున్నారు. జగన్ కి పోటీగా బాబు స్థానంలో బీజేపీని జనం గుర్తించే స్థానానికి చేరినట్టే అవుతుందని లెక్కలేస్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే బీజేపీ నేతల ఆశీస్సులు అత్యవసరంగా భావిస్తున్న చంద్రబాబు ఆత్మహత్యాసదృశ్యమైన నిర్ణయాలతో సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఇది ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం అవుతుందనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -