Wednesday, April 24, 2024
- Advertisement -

డిక్లరేషన్ పై చంద్రబాబు ఎందుకంత పోరాటం చేస్తున్నారు.. అవి బయటపడతాయనేనా.. ..?

- Advertisement -

చంద్రబాబు తన తప్పులని కప్పిపుచ్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు.. అమరావతి విషయంలో చంద్రబాబు ఆడుతున్న గేమ్ చాలా దగ్గరినుంచి చూసిన వారికి మాత్రమే అర్థమవుతుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.. అమరావతి లో వాస్తవానికి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది అన్నది నిజం.. అయితే ఒకవేళ అక్కడ జగన్ సిబిఐ విచారణ జరిపితే ఎక్కడ తాను దొరికిపోతానేమో అని కోర్టు ద్వారా జగన్ చేతులు నొక్కే ప్రయత్నం చేశారు.. అంతకు ముందు అమరావతి ఉద్యమం తో తన స్వా ప్రయోజనాల కోసం తీవ్రంగా శ్రమించిన అది వర్క్ అవుట్ కాలేదు..

అధికార ప్రభుత్వం పై ఎలాంటి అబద్దాలు వేయాలని చూస్తున్న చంద్రబాబు కు రాష్ట్రంలో జరుగుతున్న దేవాలయాల దాడి ఒక ఆయుధంగా దొరికింది.. అంతర్వేది దగ్ధం విషయంలో అయన చేసిన హడావుడి ప్రతిపక్షంలో ఉండే లీడర్లకు ఒక ఇన్స్పిరేషన్ వీడియో లాంటిది అని చెప్పొచ్చు.. ఇక ఇతర దేవాలయాల్లో జరిగిన దాడులు కూడా టీడీపీ పెద్దదిగా చేసే ప్రయత్నం చేసింది.. అయితే జగన్ వాటన్నిటికీ ఇటీవలే తిరుపతి కి వచ్చి సమాధానం చెప్పేశారు.. ఈ సంఘటన తో చంద్రబాబు ఎలా అయితే జగన్ పై మాత ఛాందసవాది అని ముద్ర వేయాలని చూశారో అది కాకుండా పోయింది.. జగన్ చేసిన పనికి హిందువుల నుంచి మంచి స్పందన వచ్చింది..

ఇక జగన్ తిరుపతి  విషయంలో కూడా చంద్రబాబు అదే పద్ధతిని అవలంభిస్తున్నారు..  తిరుమల డిక్లరేషన్ విషయంలో చంద్రబాబు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావట్లేదు.. చిత్తూరులో శ్రేణుల‌ను బ‌ల‌వంతంగా ఉసిగొలిపారు. దీనికోసం ఇతర పార్టీల్లో తనకు అనుకూలంగా ఉండే కొందరిని అవసరార్థం తెరమీదికి తెస్తున్నట్లు కనిపిస్తోంది. టీటీడీ ని కాగ్ పరిధిలోకి తీసుకుపోవడంతో తాను దోచుకున్న నిధుల సంగతి బయటపడుతుందేమోనని చంద్రబాబు భయం. అందుకే.. డిక్లరేషన్‌ను తన రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని చంద్రబాబు చూస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లూ వెల్లువెత్తాయి.  ఏదేమైనా చంద్రబాబు తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి జగన్ ఈ విధంగా వాడుకోవడం ఆయనకే చెల్లింది..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -