Wednesday, April 17, 2024
- Advertisement -

గతంలోలా పవన్ కళ్యాణ్ లేడా. ఇంత మార్పు ఎందుకొచ్చెన్..!!

- Advertisement -

రాజకీయాల్లో వచ్చిన పవన్ కళ్యాణ్ లో చాల మార్పొచ్చింది అని చాల మంది అభిప్రాయపడుతున్నారు.. కుటుంబ సభ్యులు సైతం ఎప్పుడు మౌనంగా, రిజర్వుడ్ గా  ఉండే పవన్ లో గతం లో వాళ్ళు చూసిన లక్షణాలు ఏవీ కనిపించడం లేదట.. దీనికి కారణం ఏంటో అని వారు అన్వేషించడం మొదలుపెడుతున్నారట.. ఇటీవలే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ను అభిమానులు పండగ గా చేసుకున్న సంగతి తెలిసిందే.. దేశవ్యాప్తంగా ఈ రోజును అందరు చాల బాగా ఎంజాయ్ చేశారు.. ఇక శుభాకాంక్షలు కూడా దేశం నలుమూలల నుంచి వెల్లువెత్తాయి..

సినీ ఇండస్ట్రీ పెద్దలు, రాజకీయ ప్రముఖులు, సోషల్ యాక్టివిస్టులు, సామాన్య ప్రజలు సోషల్ మీడియా లో పవన్ బర్త్ డే ను తమ పోస్టులతో మోతమోగించారు.. బహుశా పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చిన ఎఫెక్ట్ వల్లే ఇది సాధ్యమైంది అంటున్నారు.. అయితే పవన్ కళ్యాణ్ లో మార్పు కు కారణం ఈ అభిమానం అనే చెప్పాలి.. ఎందుకంటే మొదటి సినిమా నుంచి అందరు పవన్ శైలిని గమనిస్తూనే ఉన్నారు.. ఎప్పుడు మౌనంగా తన పని తాను చేసుకుపోతూ ఉంటారు.. ఎవరితో నూ ఎక్కడా కలవాడు. ఫ్యామిలీ ఫంక్షన్స్ కి, మిత్రుల ఆడియో రిలీజ్ వేడుకలకి కూడా వచ్చింది చాలా తక్కువ..

అయితే ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో అప్పటినుంచి అవన్నీ ఎక్కువయ్యాయి అని చెప్పొచ్చు.. అయితే ఇదంతా రాజీకీయంగా తన పాపులారిటీ పెంచుకోవడానికి అని వార్తలు వస్తున్నా ఎంత  లేదన్న పవన్ లో ని నిజాయితీ అందరికి తెలుసు.. పాపులారిటీ ని ఈ విధంగా తెచ్చుకోరు..అలా తెచ్చుకునే మనిషి కాదు అని సన్నిహితులు చెప్తున్నారు..  కానీ పవన్ ఇలా అందరితో కలిసి మెలసి ఉండడం ఓ మంచి పరిణామమే.. ఇప్పటికే జనసేన రాజకీయంగా వీక్ గా ఉంది.. ఒక్క సీటు తో ఈ ఎలక్షన్స్ లో సరిపెట్టుకుని అంచనాలను దారుణంగా తారుమారుచేసింది.. పవన్ కే సీటు దక్కలేదంటే పార్టీ పరిస్థితి ఎంతలా తయారైందో అర్థం చేసుకోవచ్చు.. మరి ఈ మార్పు పార్టీ కి ముందు ముందు ఏవిధంగా హెల్ప్ అవుతుందో చూద్దాం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -