పేదవాళ్ళ కోసం చెవిరెడ్డి ఆధ్వర్యంలో శానిటైజర్ల పంపిణీ..!

486
Chevireddy Bhaskar Reddy Distribution of sanitizers
Chevireddy Bhaskar Reddy Distribution of sanitizers

కరోనా భూతం ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది. ప్రపంచ దేశాలు ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉన్నాయి. ప్రతి నిమిషం ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే భారత్ లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దాంతో ప్రభుత్వాలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రజలు ఎవరు భయటకు రావొద్దని అధికార్లు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపైకి రావొద్దని.. నిత్యవసర వస్తువులకు దగ్గర్లో ఉన్న షాపుల్లో కొనుకోవాలని సూచిస్తున్నారు. అనోసరంగా రోడ్లపైకి వచ్చేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణ, ఏపీలో ఈ పరిస్థితి ఉంది. నిత్యవసర వస్తువులపై, మాస్కులపై రేట్లు పెంచినవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అధిక ధరలకు ఎవరైన అమ్మితే తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరుతోంది. ఇక ఎప్పటికప్పుడు చేతులు కడుకోవడం.. నీళ్లు ఎక్కువగా తాగాలని నిపుణులు చెబుతున్నారు. ముఖన్ని అసలు తాకకుండా ఉండాలని.. బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా మాస్కు ధరించాలని అంటున్నారు.

ఇక కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా చేతి పరిశుభ్రతకు అవసరమైన శానిటైజర్లను ఎమ్మెల్యే, తుడా చైర్మెన్, ప్రభుత్వ విప్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో..” ఉచిత పంపిణీ ” కార్యక్రమం చేపట్టారు. చంద్రగిరి నియోజకర్గం పరిధిలో ప్రజలకు కరోనా మహమ్మారి దరి చేరకుండా చేతి పరిశుభ్రతకు అవసరమైన శానిటైజర్లను ఇంటింటికీ దాదాపు 3.40 లక్షలు బాటిల్స్ ను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇది సహాయం కాదు కష్టకాలంలో తోడని లాక్ డౌన్ సమయంలో పేదవాళ్ళ కష్టాలని దృష్టిలో పెట్టుకుని ఇలా చేస్తున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం లానే మిగితవారు కూడా చేస్తే ఈ మహ్మారిని తరిమికొట్టొచ్చని.. కరోనా రాకుండా జాగ్రత్తపడొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఏపీలో 29న ఉచితంగా రేషన్ తో పాటు ఒక కేజీ కందిపప్పు అలాగే ఏప్రిల్ 4వ తేదీన ప్రతి కుటుంబానికి రూ.1000/- సహాయం వాలంటీర్ల ద్వారా అందచేస్తాం అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

Loading...