Wednesday, April 24, 2024
- Advertisement -

పార్టీ గెలవదు, నేనూ గెలవను, మీపైన ఎవ్వరికీ నమ్మకం లేదుః బాబుతో ఆమంచి

- Advertisement -

నలభై ఏళ్ళుగా అబద్ధాలు, కుట్ర రాజకీయాలు చేస్తూ మీడియా మేనేజ్‌మెంట్‌తో నెగ్గుకొచ్చిన బాబుకు ఇప్పుడు అసలు సినిమా కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో ఏదో చేస్తున్నాను నమ్మండి అని టిడిపి నాయకులతో చంద్రబాబు చెప్తూ ఉంటే……….స్వయంగా ఆ టిడిపి నాయకులు మాత్రం 2019 ఎన్నికల్లో టిడిపి గెలిచే అవకాశం లేదు……అలాగే ప్రజలతో పాటు నాయకులు ఎవ్వరూ కూడా బాబు నాయకత్వాన్ని నమ్మే అవకాశమే లేదని చంద్రబాబు దగ్గరే తేల్చేస్తున్నారు. గవర్నర్ పదవులు, ఇతర పదవులు అంటూ ఎంతమందిని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారో అందరికీ తెలుసని, అలాగే ఇప్పుడు కూడా ఒక్కొక్క టికెట్‌కి నలుగురైదుగురికీ ఇస్తాను అని చెప్తూ అందరి దగ్గరా వసూళ్ళు చే్స్తూ, అందరి చేతా ఖర్చు పెట్టిస్తూ స్వయంగా టిడిపి నాయకులనే మోసం చేస్తున్న వైనంపై తెదేపా నాయకులందరూ తీవ్రంగా చర్చించుకుంటూ ఉన్నారు. అందుకే యనమల రామకృష్ణుడులాంటి సీనియర్స్ కూడా తన కుటుంబ సభ్యులను వైకాపాలో చేరేలా ప్రోత్సహిస్తున్న పరిస్థితి.

తాజాగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కూడా చంద్రబాబుతో డైరెక్ట్‌గా ఇదే విషయం తేల్చేశారు. భ్రమల్లో బ్రతకొద్దు అని చంద్రబాబుతోనే డైరెక్ట్‌గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలెవ్వరూ నిన్ను నమ్మడం లేదని, 2019 ఎన్నికల్లో తెదేపా గెలిచే అవకాశమే లేదని ఘంటాపథంగా చెప్పేశాడు. అలాగే నాలాంటి నాయకులకు నువ్వు ఇస్తున్న హామీలు, ఇస్తున్న భరోసాపైన పూర్తిగా నమ్మకం పోయిందని ఆమంచి డైరెక్ట్‌గానే చెప్పేశాడు. దశాబ్ధాలుగా అందరికీ అబద్ధపు హామీలు ఇస్తూ, చాలా మందిని మోసం చేసిన నేపథ్యంలో ఇప్పుడు నీ మాటలపైన నాతో సహా టిడిపి నాయకులకే నమ్మకం పోయిందని చంద్రబాబుతో చెప్పేశాడు ఆమంచి. మాటపైన నిలబడడం, నమ్మకంలాంటి విషయాల్లో వైఎస్‌లకు నీకు పోలికే లేదని, నమ్మినవాళ్ళను గౌరవించడం, నమ్మకంగా చూసుకోవడం వైఎస్‌ రాజశేఖరరెడ్డిని, జగన్‌ని చూసి నేర్చుకోవాలని, లోకేష్‌కి అయినా అలాంటి లక్షణాలు నేర్పిస్తే భవిష్యత్‌లో అయినా టిడిపి బాగుపడే ఛాన్స్ ఉందని చంద్రబాబుతో చెప్పాడు ఆమంచి. త్వరలోనే వైకాపాలో చేరుతున్నానని, జగన్‌ నాయకత్వం, జగన్ ఇచ్చిన హామీలపై నమ్మకం ఉందని………….నీపై మాత్రం అస్సలు నమ్మకం లేదని తేల్చేసిన ఆమంచి నిర్మొహమాటంగా తన మనసులో మాటలు చెప్పెయ్యడంతో చంద్రబాబు షాక్ తిన్నాడని ప్రస్తుతం టిడిపి నాయకులే హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నారు. చంద్రబాబుపై అలా విరుచుకుపడడం నచ్చకపోయినప్పటికీ ఆమంచి లాంటి నాయకులు ఒక్కరైనా అసలు విషయం ఘాటుగా చెప్పడం మంచిదే అని…………..చంద్రబాబు భ్రమల ప్రపంచంలో నుంచి వాస్తవ ప్రపంచాన్ని చూసే అవకాశం ఉంటుందని ఒక సీనియర్ టిడిపి నాయకుడు చెప్పడం చంద్రబాబుపై టిడిపి నాయకులు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో తెలియచేస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -