జగన్‌ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

1711
chiranjeevi appreciated ap govt decision on new act disha
chiranjeevi appreciated ap govt decision on new act disha

జగన్ సర్కార్ మహిళల భద్రత కోసం మంచి నిర్ణయం తీసుకుంది. మహిళలపై అత్యాచారాలు, నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్ష పడేలా ముసాయిదా బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఆమోదం కూడా తెలిపారు. ఈ నిర్ణయంను హీరో చిరంజీవి స్వాగతంచారు. జగన్ పై ప్రశంసలు కురిపించారు.

’ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం – 2019 పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ప్రధానంగా మహిళా సోదరీమణులకు, లైంగిక వేధింపులకు గురవుతున్న చిన్నారులకు ఈ చట్టం భరోసా, భద్రత ఇస్తుందన్న ఆశ నాలో ఉంది. దిశ సంఘటన మన అందర్నీ కలిచివేసింది. తక్షణ న్యాయం కంటే సత్వర న్యాయం మరింత సత్ఫలితాల్ని ఇస్తాయన్న నమ్మకం అందరిలో ఉంది. అందుకే అలాంటి సత్వర న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ లో తొలి అడుగులు పడడం హర్షణీయం’అన్నారు.

’సీఆర్పీసీ(CRPC) ని సవరించడం ద్వారా 4 నెలలు అంతకంటే ఎక్కువ పట్టే విచారణా సమయాన్ని 21 రోజులకు కుదించడం, ప్రత్యేక కోర్టులు ఇతర మౌళిక సదుపాయాల్ని కల్పించడంతో పాటు ఐపీసీ(IPC) ద్వారా సోషల్ మీడియా ద్వారా మహిళల గౌరవాన్ని కించపరచడం లాంటివి చేస్తే తీవ్రమైన శిక్షలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవిత ఖైదు విధించడం ద్వారా నేరాలోచన ఉన్న వాళ్లలో భయం కల్పించే విధంగా చట్టాలు తేవడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ చర్యలతో మహిళా లోకం నిర్భయంగా, స్వేచ్ఛగా ఉండగలుగుతుందన్న నమ్మకం నాకు ఉంది’అన్నారు చిరంజీవి.

అయితే రెండు నెలల క్రితం ఏపీ సీఎం జగన్ ను చిరంజీవి కలిశారు. జగన్‌, చిరంజీవి దంపతులు కలిసి భోజనం చేశారు. తాను నటించిన సైరా చూడాలని జగన్ ను చిరు కోరారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ రైతులకు మద్దతుగా కాకినాడలో దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ కు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే జగన్ చేస్తున్న పనులు అద్భుతం అని చిరంజీవి అభినందించటం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

Loading...