జగన్ హ్యాపీ ఫీల్ అయ్యే విషయం చెప్పిన చిరు, సురేష్ బాబు..!

918
Chiranjeevi & Suresh Babu Good News to Jagan
Chiranjeevi & Suresh Babu Good News to Jagan

రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం రకరకల చర్చలకు దారి తీస్తోంది. అమరావతి ప్రాంతనికే కట్టుబడి ఉండాలని అమరావతి మాత్రమే తమకు రాజధానిగా ఉండాలని టీడీపీ అంటుంటే.. మూడూ రాజధానులు రాష్ట్రానికి మేలు అని వైసీపీ అంటుంది. బీజేపీ, జనసేన మాత్రం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ అమరావతి కష్టాలు పట్టించుకోవాలని అంటున్నాయి. అయితే గవర్నర్ ఆమోద ముద్ర తర్వాత మూడు రాజధానుల అనే విషయం అధికారికంగా ఖరారు కావడంతో తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

విశాఖ పరిపాలన రాజధాని కావడం.. ఇండస్ట్రీ వర్గాల్లో ఆనందంకు కారణం అయిందట. రాష్ట్ర విభజన తర్వాత సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ ను విడిచిపెట్టి రాలేదు. ఆ అవసరం కూడా రాలేదు. అయితే ఇప్పుడు విశాఖ ఎక్సిక్యూటివ్ క్యాపిటల్ గా మారితే మాత్రం ఇండస్ట్రీ విశాఖకు తరలించే అవకాశం కనిపిస్తోందని చిరంజీవి, సురేష్ బాబుల నుండి జగన్ ఓ వార్త వెళ్లినట్లు తెలుస్తోంది. హైదరబాద్ లో ఉన్న స్టూడియోలు.. మిగిత ఏర్పాట్లు అన్ని వదిలిపెట్టి ఇప్పటికిప్పుడే తెలుగు ఇండస్ట్రీ విశాఖకు వస్తుందని చెప్పలేం.

కానీ అదే సమయంలో సీఎం జగన్ కు కలిసిన సందర్భంలో తెలుగు సినిమా ప్రముఖులు విశాఖలో సినీ పరిశ్రమకు సంబంధించి ప్రోత్సహాలపై కూడా మాట్లాడారట. విశాఖలో స్టూడియోల నిర్మాణంకు, అలానే షూటింగ్ ల పర్మిషన్ కు అనుమతి ఉంటుందని వారికి సీఎం జగన్ కూడా హామీ ఇచ్చారు. అమరావతిలో ఇవన్ని ఏర్పాడలంటే చాలా టైం పడుతోంది. అదే విశాఖలో అయితే సురేష్ ప్రొడక్షన్ కు సంబంధించి స్టూడియో నిర్మాణంలో ఉంది. ఇతర ఏర్పాట్లు కూడా కాస్తో కూస్తో జరిగాయి. అందులోనూ వసతి, ఔట్ డోర్ షూటింగ్ లకు అనుకులమైన ప్రాంతం. అందుకే విశాఖ రాజధాని అనేసరికి ఇండస్ట్రీ వర్గాలు సంతోషిస్తున్నాయట.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. త్వరలో కరోనా వ్యాక్సిన్ వస్తే అన్ని సర్దుకుంటాయని హైదరాబాద్ కు అల్టర్నెట్ గా విశాఖలో సినీ ఇండస్ట్రీ ఎదగడం ఖాయం అని అంటున్నారు. రాష్ట్రాలు విడిపోయినా.. సినీ ఇండస్ట్రీ మాత్రం ఒక్కటిగానే కలిసి ఉంది. హైదరాబాద్ కు వెళ్లి అవకాశాల కోసం చూసే ఏపీ వారు.. ఇక విశాఖలోనే ఆఫర్స్ దక్కించుకోవచ్చు. ఓ రకంగా విశాఖలో పర్మిషన్ ఇచ్చి జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు.

జగన్ కొట్టి మాట్లాడతారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన పృథ్వీ..!

రాజధాని అంశంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. జగన్ కు గుడ్ న్యూస్..!

జిల్లాల విభజన.. ఎవరూ ఊహించిన సర్ ఫ్రైజ్ ఇవ్వనున్న సీఎం జగన్..!

జగన్ కొత్త సూత్రానికి ఫిదా అయిన మోడీ.. ?

Loading...