వైఎస్సార్ కు జగన్ నివాళులు.. భర్తపై పుస్తకం రాసిన వైఎస్ విజయమ్మ..!

380
CM Jagan and family members pay tribute to YSR
CM Jagan and family members pay tribute to YSR

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయనకు కుటుంబ సభ్యులు ఈ రోజు నివాళులు అర్పించారు. వైఎస్‌ జగన్‌తో పాటు విజయమ్మ, భారతి,‌ షర్మిల, అనిల్‌ కుమార్‌, ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయమ్మ రాసిన ’నాలో.. నాతో వైఎస్సార్’ పుస్తాకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ..”33 ఏళ్లు ఆయనతో కలిసి జీవించిన సమయంలో ఆయనలో నేను చూసిన మంచితనం.. ఆయన చెప్పిన మాటల ఆధారంఘా ఈ పుస్తకం రాశాను. ఆయన మంచితనం గురించి రాయలనిపించింది. ఎంతో మంది జీవితాలకు ఆయన వెలుగునిచ్చారు. ఎన్నో గొప్ప అంశాలన్ని ఆనలో చూశాను. ఆయన ప్రత్యర్థులు కూడా ఆయన జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన ప్రతిమాట, ప్రతి అడుగు గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంది.

ఎందుకంటే నా కొడుకు, కోడలు.. కూతురు, అల్లుడు ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితుల్లో వైఎస్సార్‌ మాటలను గుర్తు తెచ్చుకుని వాటి స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటుంటారు. ప్రతి ఒక్కరు ఈ పుస్తకం చదివి వారు కూడా వైఎస్సార్ స్ఫూర్తిని కొనసాగిస్తారని భావిస్తూ నేను ఈ పుస్తకం రాశాను’ అని విజయమ్మ తెలిపారు. ఈ పుస్తకంలో తమ వైవాహిక జీవితం, పేదల కోసం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి వైద్యం చేయడం, రాజకీయ రంగప్రవేశం, తమ పిల్లలు, దేవుడి పట్ల వైఎస్సార్ భక్తి, మరణానంతరం ఎదురైన సమస్యలు, సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు జరిగిన అన్ని ఘట్టాలను ప్రస్తావించారు.

అంబులెన్స్ నడిపిన ఎమ్మెల్యే రోజా.. వీడియో..!

ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కరోనా పాజిటివ్..?

పరిశ్రమల భద్రత, ప్రజల రక్షణ కోసం కొత్త చట్టాలు తెస్తాం : జగన్

లైవ్ లో చంద్రబాబుకి షాక్ ఇచ్చిన ఎంఆర్ఓ..!

Loading...