మంచి మనసున్న సీఎం అనిపించుకున్న జగన్..!

481
cm jagan announced free transport for migrants within ap
cm jagan announced free transport for migrants within ap

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే ఈ లాక్ డౌన్ లక్షలాది మంది వలస కార్మికులను తీవ్ర కష్టాల్లోకి నెట్టింది. ఉన్న చోట తినడానికి తిండి లేదు. చేసుకోవడానికి పనిలేదు. దాంతో తమ స్వస్థాలాలకు వెళ్లేందుకు రావణా సదుపాయాలు లేక చాలా బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక.. వలస కార్మికులు కాలినడకనే ప్రమాదకర రీతిలో ప్రయాణాలు సాగిస్తున్నారు.

ఏ రహదారులపై చూసినా వీరే. నడుచుకుంటూనో, సైకిళ్లపై ప్రయాణిస్తూనో వలస కార్మికుల కుటుంబాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వారికోసం ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కానీ దీనిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో తమ సొంత రాష్ట్రాలకు నడుచుకుంటూ వెళుతున్న వలస కార్మికులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

ఏపీ రహదారుల్లో నడుచుకుంటూ వెళ్తున్న వలస కార్మికులు ఎక్కడ కనిపించినా సరే.. వారిని వెంటనే బస్సులో ఎక్కించి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా పంపించండి అని అధికారులను ఆదేశించారు. వలస కార్మికులు, కూలీల పట్ల ఉదారంగా వ్యవహరించాలని, తాగునీరు, భోజన ఏర్పాట్లు చేయాలని సూచించారు. వారి కోసం 15 రోజుల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు సీఎం జగన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Loading...