శంకుస్థాపన వాయిదా.. వెనుకడుగు వేసిన జగన్.. ఎందుకు ?

1723
cm jagan backstep in making vizag as capital
cm jagan backstep in making vizag as capital

ఏపీ సీఎం జగన్ విశాఖ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దానిని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసేందుకు సిద్దపడిన సంగతి తెలిసిందే. అందుకు గవర్నర్ ఆమోదం కూడా తెలిపారు. రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలించేందుకు ఈనెల 16ని సరైన తేదిగా ఖరారు చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే 16న ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ శంకుస్థాపన చేయాలని జగన్ తొలిత భావించారు. ఈ నేపథ్యంలో మోడీని ఆహ్వానించేలా కూడా జగన్ ప్లాన్ చేసుకున్నారు.

అయితే ఈ మూడు రాజధానుల అంశంకు సంబంధించి కోర్టుల్లో కేసులు నడుస్తున్న నేపథ్యంలో దాని నుంచి బయటపడిన తర్వాతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కి శంకుస్థాపన చేపట్టేందుకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ కార్యక్రమంలో మోడీ ప్రత్యక్షం గానో లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానో పాల్గొంటారని జగన్ ప్రభుత్వం భావించింది. అయితే ఈ క్రమంలో కొత్త ముహూర్తంగా విజయదశమి నాడు ప్రధానిని విశాఖకు ఆహ్వానించే ప్రక్రియ మొదలైపోయినట్లు తెలుస్తోంది. విశాఖ శంకుస్థాపనకు ప్రధానిని స్వయంగా జగన్ ఢిల్లీ వెళ్లి ఆహ్వానించవచ్చు అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇక మూడు రాజధానులకు సంబంధించి ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులపై కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో రాష్ట్రం అంతటా గందరగోళం నెలకొంది. ఈ టైంలో జగన్ విశాఖలో రాజధాని శంకుస్థాపన విషయంలో వెనక్కి తగ్గడం చిన్న విషయం కాదు. జగన్ అనుకుంటే శంకుస్థాపన అనుకున్న సమయానికి పూర్తి చేసేసేవాడు కానీ అతను వెనక్కి తగ్గాడు అంటే ఏదో బలమైన కారణం పైనే కేసులు నమోదయ్యాయని మళ్ళీ ఆ విషయంలో తొందరపడి పడడం ఇష్టంలేక జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అన్న చర్చ జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు.. ఎవరి నుంచో తెలుసా ?

జగన్ కోరిక మేరకు దిగివచ్చిన మోడీ.. ఫ్యాన్స్ కు పండగే..!

ఫ్యాన్స్ : ప్రభాస్ డైలాగ్ తో దుమ్ములేపుతున్న జగన్..!

టీడీపీ భవిష్యత్తు లేదు.. జూ ఎన్టీఆర్ లాభం లేదు : కొడాలి నాని

Loading...