Friday, April 19, 2024
- Advertisement -

పార్టీ నేతలకే జగన్ షాక్.. వారికి ఊహించని పదవులు..!

- Advertisement -

గవర్నర్ కోటాలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు కొలికి వచ్చింది. మాట తప్పడం మడమ తిప్పడం అలవాటు లేని జగన్ ఆ ఇద్దరికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామాలతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిని ఎవరికి ఇస్తారు ? జగన్ ప్రాధాన్యం ఎలా ఉంటుంది ? దేనికి ఆయన మొగ్గు చూపుతారు అనే చర్చలు పార్టీలోను, బయట జరుగుతూనే ఉన్నాయి.

అయితే గతంలో మాట ఇచ్చిన జగన్ ఆ ఇద్దరి అభ్యర్ద్యత్వానికి ఆమోదముద్ర వేశారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి సీటు త్యాగం చేసిన చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ను ఒక అభ్యర్థిగా జగన్ ఎంపిక చేశారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా జిల్లా పార్టీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అందరికీ తలలో నాలుకలా ఉన్నారు రాజశేఖర్. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీనే నమ్ముని ఉన్నారు మర్రి. 2019 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ గెలుపే కొలమానంగా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని నిర్ణయించారు. ఆ నేపథ్యంలోనే రాజశేకర్ కు బదులు కొత్తగా పార్టీలోకి వచ్చిన విడుదల రజిని అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పై పోటీకి దింపి విజయం సాధించారు.

ఆ ఎన్నికల ప్రచారానికి చిలకలూరిపేట వచ్చిన జగన్.. మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తానని ప్రకటించారు. మండలి రద్దు చేయాలని గట్టి పట్టుదలతో ఉన్న జగన్.. మర్రిని చిలకలూరిపేట జనం సాక్షిగా ఆయన ఇచ్చిన హామీని ఎలా నెరవేరుస్తారా అని అంతా అనుకున్నారు. గవర్నర్ కోటాలో రెండు స్థానాలు ఖాళీ కావడంతో మరో ఆలోచన లేకుండా మర్రి రాజశేఖర్ ను అభ్యర్థిగా నిర్ణయించేశారు. ఇక రెండో సీటు విషయంలోనూ జగన్ ఆచితూచి అడుగు వేశారు. సామాజిక కోణంలో లాభనష్టాలను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో మంచి పట్టున్న మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు జగన్. మొన్నటి ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన త్రిమూర్తులు ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రోత్సాహంతో వైసీపీలో చేరారు త్రిమూర్తులు. పార్టీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో ఉభయ గోదావరి జిల్లాల్లో తిరుగులేకుండా చేసుకోవాలన్నది జగన్ ప్లాన్. పార్టీలో చేరే ముందే త్రిమూర్తులకు ఎమ్మెల్సీ పదవిని జగన్ ఆఫర్ చేశారు. అందుకు అనుగుణంగా ఇప్పుడు ఆయన గవర్నర్ కోటాలో శాసనమండలికి పంపుతున్నారు.

ఎంపీ రఘురామకు ఊహించని షాక్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు..!

చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయిన ఎంపీ విజయసాయి రెడ్డి

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. అన్ని ఆసుపత్రిల్లో కరోనా ఉచిత చికిత్స..!

కేసీఆర్ కంటే జగనే బెటర్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -