Saturday, April 20, 2024
- Advertisement -

ప్రధానీ మోడీ ఆఫర్ ను జగన్ తిరస్కరించడానికి కారణం ఏంటి ?

- Advertisement -

రాష్ట్రంలో బీజేపీ వైసీపీ మధ్య రాజకీయ సంబంధాలు ఉప్పు నిప్పులా ఉన్నాయి. అధికారపార్టీ ఏ పని చేసిన దాన్ని విమర్శించేందుకు టీడీపీతో కలిసి బీజేపీ ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ కేంద్రంలో మాత్రం జగన్తో సానుకూలంగానే ఉన్నట్టుగా బీజీపీ అగ్రనాయకులు వ్యవహరిస్తున్నారు.

జగన్ కు ఏ అవసరం వచ్చినా తాము ఉన్నామంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు గా వ్యవహరిస్తోంది. ఇలా ఉంటే త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టినున్న నేపథ్యంలో వైసీపీ కేంద్ర మంత్రివర్గంలో చేయాల్సిందిగా బీజీపీ ఆఫర్ ఇస్తున్న జగన్ తిరస్కరిస్తురట. ప్రస్తుతం బీజేపీ పార్లమెంటులోనూ రాజ్యసభలోనూ బలంగా ఉంది. కేంద్రం ప్రవేశపెట్టే బిల్లుకు వైసీపీ మద్దతు ఇస్తోంది. లోకసభలో 22 మంది ఎంపీలు.. రాజ్యసభలో ప్రస్తుతం గెలిచిన సభ్యులతో కలిసి ఆరుగురు సభ్యులు ఉన్నారు.

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వైసీపీతో బీజేపీ ప్రభుత్వానికి చాలా అవసరం ఉన్నాయి. అందుకే రాజకీయ విభేదాలను పక్కన పెట్టి మరి బీజేపీ ప్రభుత్వంలో చేయాల్సిందిగా వైసీపీకి ఆఫర్లు ఇస్తున్న జగన్ మాత్రం ఆ ఆఫర్ను తీసుకునేందుకు ఇష్టం లేదట. దీనివెనుక కారణాలు చాలానే ఉన్నాయి. వైసీపీ ఈ స్థాయిలో విజయం సాధించింది అంటే దానికి దళితులు మైనారిటీ ఓటు బ్యాంకే కారణం. సామాజికంగా ఈ రెండు వర్గాలు బీజేపీ అంటే ఇష్టపడవు. ఒక వేళ బీజేపీతో కలిసిన రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాలి అనే ఆలోచనతో జగన్ వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకే కేంద్ర మంత్రి మండలి లో చేరే విషయంలో జగన్ పెద్దగా ఆసక్తి చూపించినట్లు గానే వ్యవహరిస్తున్నారు. కేంద్ర మంత్రి మండలి చెరకపోయిన బీజెపీ తో ఢిల్లీ స్థాయిలో సన్నిహితంగా ఉంటూ ఏపీ కి కావలసిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఎటువంటి ఢోకా లేకుండా చేసుకోవాలని అవసరమైన సందర్భంలో బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇవ్వాలన్న ఆలోచనలో జగన్ ఉండటంతోనే ప్రధానీ మోడీ ఇస్తున్న ఆఫర్ను జగన్ తిరస్కరిస్తున్నట్లు గా అర్థం అవుతోంది.

వాక్సిన్ వచ్చేవరకు ఇలానే ఉంటుంది : జగన్

మిథున్ రెడ్డి అభినందిస్తే.. జగన్ కోపడ్డారు : రఘురామకృష్ణరాజు

సీఎం జగన్ తో ముద్రగడ అత్యవసర భేటీ ?

యాత్ర మూవీలో డైలాగ్ ను జగన్ చేసి చూపించారు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -