పరిశ్రమల భద్రత, ప్రజల రక్షణ కోసం కొత్త చట్టాలు తెస్తాం : జగన్

343
Cm Jagan Serious Comments On High Power Committee Report On Vizag Gas Leak
Cm Jagan Serious Comments On High Power Committee Report On Vizag Gas Leak

పరిశ్రమలకు సంబంధించి భవిష్యత్తులో తీసుకునే చర్యలకు హైపవర్ కమిటీ నివేదిక మార్గదర్శకమని ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీపై సోమవారం హైపవర్‌ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో సీఎం జగన్ మాట్లాడారు. పరిశ్రమల భద్రత, ప్రజల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

“ఇందుకోసం.. అవసరమైతే చట్టాలు మారుస్తాం. కొత్త చట్టాలు తీసుకొస్తాం. నివాస ప్రాంతంలో ఉన్న పరిశ్రమలను దూరంగా తరలిస్తాం. పరిశ్రమలను గ్రీన్, వైట్ కేటగిరీలో మార్చుకోవాలని ఆదేశిస్తాం” అని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. పరిశ్రమల శాఖలన్నీ.. పటిష్ట కార్యాచరణ, ప్రణాళిక, ప్రోటాకాల్‌ సిద్ధం చేసుకోవాలని సూచించారు. హైపర్ కమిటీ నివేదికను ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉంచాలని సీఎం జగన్ ఆదేశించారు. కాగా, విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి తుది నివేదికను సమర్పించింది.

యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదానికి దారితీసిందని కమిటీ నివేదికలో పేర్కొంది. సీఎంకు నివేదిక సమర్పించిన అనంతరం కమిటీ చైర్మన్‌ నీరబ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. విశాకలో గ్యాస్ లీకేజ్ మాత్రమే కాదు స్టైరిన్‌ కూడా పెద్ద ఎత్తున రిలీజ్ అయిందని తెలిపారు. ట్యాంకుల్లో ఉష్ణోగ్రతలను కాపాడం చాలా ముఖ్యమైన విషయమని.. అయితే ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఈ విషయంలో తప్పిందం చేసిందని చెప్పారు.

సీఎం జగన్ ను మెచ్చుకుంటున్న కేంద్రం ?

జగన్ నుంచి రోజా , విడదల రజిని లకు గుడ్ న్యూస్ ?

కొల్లు రవీంద్రను అరెస్ట్ పై స్పందించిన కొడాలి నాని

మోకా భాస్కరరావు హత్య వెనుక కొల్లు హస్తం.. : ఎస్పీ రవీంద్రనాథ్‌

Loading...