సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల సాయం..!

1655
cm kcr announced five crore compensation santosh babu family
cm kcr announced five crore compensation santosh babu family

సరిహద్దులో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సూర్యాపేట జిల్లావాసి కల్నల్‌ సంతోష్‌ బాబు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అయితే సంతోష్‌ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిస్తోందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సంతోష్‌ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 5 కోట్ల నగదుతోపాటు నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్‌–1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

తానే స్వయంగా కల్నల్‌ సంతోష్‌ ఇంటికి వెళ్లి సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇదే ఘర్షణలో మరణించిన మిగతా 19 మంది అమర జవాన్ల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరఫున రక్షణ మంత్రి ద్వారా అందిస్తామన్నారు. ఇక దేశ రక్షణ కోసం సరిహద్దులో ని సైనికులకు దేశం అండగా నిలవాలని.. వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదోవాలని.. అంతేకాకుండా సైనికుల్లో ఆత్మవిశ్వాసం, వారి కుటుంబాల్లో భరోసా నింపాలని.. సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సూచించారు.

వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ రూ.5 కోట్లు, ఇంటి స్థలం, సంతోష్‌బాబు సతీమణికి గ్రూప్‌–1 స్థాయి ఉద్యోగం ప్రకటించడంతో ఆయన కుటుంబసభ్యులు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

జగన్ పై మళ్లీ విమర్శలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి

నాగబాబు అభిప్రాయాలతో మాకు లింక్ లేదు : పవన్ కల్యాణ్

జగన్ గురించి అడిగి తెలుసుకున్న మహేష్ బాబు

జగన్ పాలపై.. వైసీపీలో చేరడంపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్యామల..!

Loading...