Friday, March 29, 2024
- Advertisement -

గారాలపట్టి కి కెసిఆర్ మంత్రి పదవి ఇవ్వడం ఖాయమా..?

- Advertisement -

తెలంగాణాలో ఇటీవలే జరిగిన నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కేసీఆర్ గారాల పట్టి కవిత కల్వకుంట్ల గెలిచినా సంగతి అందరికి తెలిసిందే. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆమె కోల్పోయిన దగ్గరే గెలిచి తన పంతం నెగ్గించుకుంది. పోలైన మొత్తం 823 ఓట్లలో 728 ఓట్లు కవితే దక్కాయి. కాంగ్రెస్, బీజేపీలకు కలిపి వంద ఓట్లు కూడా రాలేదు. టీఆర్ఎస్ అసలు బలం 505 మంది మాత్రమే. కానీ ఓట్లు మాత్రం 123 ఎక్కువ వచ్చాయి. దాంతో కవిత అక్కడ చేసిన పనితనం కనిపిస్తుంది.. ఓడిపోయినా కోపం ప్రదర్శించకుండా అక్కడి వారి తో ఆమె మంచి గా మెలిగి మళ్ళీ గెలుపు సాధించింది..

ఇక ఇక్కడ ప్రతిపక్ష పార్టీ లు అయినా కాంగ్రెస్, బీజేపీ నేతలు పూర్తి గా విపహలమయ్యారు అని చెప్పాలి.. ధర్మపురి అరవింద్ అక్కడి పార్లమెంట్ సభ్యుడు అయినా పార్టీ ని గెలిపించుకోకపోవడం అయన రాజకీయానికి నిదర్శనంగా చెప్పాలి.. ఇంతటి అసమర్ధత చూపిస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి ఎలా వస్తుందని బీజేపీ అభిమానుల ప్రశ్న.. వాస్తవానికి రెండు పార్టీలకు సంబంధించిన స్థానిక ప్రజా ప్రతినిధులు 120 వరకూ ఉన్నారు. వారితోనూ అనుకూలంగా ఓట్లు వేయించుకోవడంలోఆ పార్టీ నేతలు విఫలమయ్యారు. వాస్తవానికి ముందునుంచి కవిత గెలుపు పై ఇక్కడ ఎలాంటి అనుమానాలు లేవు..

ఆమె ఖచ్చితంగా గెలుస్తుందని అందరు ముందునుంచి అనుకున్నారు.. కాకపోతే ఎంత మెజార్టీ వస్తుందన్నదానిపైనే ఉత్కంఠ ఏర్పడింది. కాంగ్రెస్ కన్నా బీజేపీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీకి 56 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు 29 మాత్రమే వచ్చాయి. ఈ రెండు పార్టీలు డిపాజిట్లు కోల్పోయాయి. ఇక కవిత గెలవడంతో ఆమెకు మంత్రి పదవి వస్తుందని తెగ ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఈ పాటికి ఎమ్మెల్సీగా ఎన్నికయి ఉండేవారే. కేసీఆర్ ఇవ్వాలనుకున్న కీలక పదవి ఇచ్చేవారే. అయితే.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఆమెకు దక్కబోయే కీలక పదవి ఏమిటన్నదానిపై చర్చ జరుగుతోంది. కాబోయే మంత్రి కవిత అని కొంత మంది నిజామాబాద్ నేతలు ఇప్పటికే ప్రకటనలు చేస్తున్నారు. అయితే మంత్రి పదవి ఇస్తారా లేకపోతే మరొకటా అన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది.

దుబ్బాక లో టీఅరెస్ గెలుపు ఖాయం.. సర్వే లు అవే చెప్తున్నాయి..

దుబ్బాక లో ఎవరి బలం ఎంత..?

రివర్స్ గేమ్ ఆడుతున్న కేసీఆర్….?

గులాబీ పార్టీ మళ్ళీ కొత్త చట్టం తేబోతుందా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -