Saturday, April 20, 2024
- Advertisement -

కేసీఆర్ క్యాబినేట్‌ టీమ్‌లో మంత్రులుగా ఉండేది వీళ్లేనా…?

- Advertisement -

తెలంగాణ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ రేపు (గురువారం) మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా.. అతి సాధారణంగా ప్రమాణ స్వీకారం చేయాలనే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం.

తెలంగాణలో కొత్తగా ఏర్పడబోతున్న టీఆర్ఎస్ 2 ప్రభుత్వంలో మంత్రులుగా ఎవరు ఉండబోతున్నారనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సామాజికవర్గాల కూర్పుతో కేబినెట్‌ను ఏర్పాటు చేయడం ఒక రకంగా కేసీఆర్‌కు సవాలే.

గ‌తంలో కేబినేట్‌లో ఒక్క మ‌హిళ‌ల‌కు కూడా స్థానం ఇ్వ‌లేద‌నే అప‌వాదు కీసీఆర్‌ను వెంటాడుతోంది. ఈసారి ఎవ‌రూ వేలెత్తి చూప‌కుండా ఈసారి మ‌హిళ‌ల‌కు త‌న టీమ్‌లో చోటు ఇవ్వ‌నున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.టీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జిల్లాలు, సామాజికవర్గాల వారీగా ఈ సారి కేబినెట్‌లో వీరికి చోటు దక్కే అవకాశం ఉంది.

అదిలాబాద్- రేఖానా
ఇక మంత్రివర్గం లో కొత్తగా చేరేవారు వీరేనంటూ ప్రచారం సాగుతోంది. వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి)- బాల్క సుమన్ (చెన్నూరు)- నోముల నర్సింహయ్య (నాగార్జునసాగర్)- సింగిరెడ్డి నిరంజన్రెడ్డి (వనపర్తి)- దాస్యం వినయ్భాస్కర్ (వరంగల్ తూర్పు)- శ్రీనివాస్గౌడ్ (మహబూబ్నగర్)- రేఖానాయక్ (ఖానాపూర్)- పద్మా దేవేందర్రెడ్డి (మెదక్)- ఎర్రబెల్లి దయాకర్రావు (పాలకుర్తి)- వేముల ప్రశాంత్రెడ్డి (బాల్కొండ)- మాధవరం కృష్ణారావు (కూకట్పల్లి) పేర్లు కేసీఆర్ కొత్త టీం లో ఉండనున్నాయి.

అయితే వీరిలో జిల్లాలు, సామాజికవర్గాల్లో ఏదో ఒక ప్రాతిపదికగా మంత్రివర్గ కూర్పు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అనూహ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకొనే కేసీఆర్ క్యాబినేట్ కూర్పు విష‌యంలో ఎలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -