జగన్ చెప్పిందే కేసీఆర్ చెప్పారు.. ఇప్పుడు ఏం అంటారు ?

1333
CM KCR Press Meet on Coronavirus in Telangana
CM KCR Press Meet on Coronavirus in Telangana

కొన్ని సార్లు ఎంతో ఆలోచించి చెప్పే మాటలు కామెడీగా.. ఎటకారంగా ఉంటాయి. దాంతో ఆ మాటలు నవ్వులు పాలు చేస్తుంటాయి. అయితే ఆ తర్వాతి రోజుల్లో అవే మాటలు రోల్ మోడల్ గా మారుతాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎదుర్కొంటున్నారు. ముందు చూపుతో కరోనా వైరస్ విషయంలో ఆయన చెప్పిన మాటలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కరోనాతో కలిసి జీవనం సాగించాల్సిన అవసరం ఉందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పిడంతో.. ఆయనపై చాలా మంది ఎటకారపు మాటలు గుప్పించారు.

ఇంత బాధ్యతారాహిత్యంతో మాట్లాడతారా ? అంటూ ప్రశ్నలు కురిపించారు. ఇలాంటి వేళలో.. ఊహించని రీతిలో ఆయన నోటి నుంచి వచ్చిన షాకింగ్ నిర్ణయాల ప్రభావం తాజాగా తెలంగాణ సీఎం మీదా పడినట్లుగా కనిపిస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ.. మరోసారి లాక్ డౌన్ పొడిగింపు అంశాన్ని ప్రస్తావిస్తూ.. వైరస్ తో బతకాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసారు. కరోనాతో కలిసి జీవనం చేయాల్సి ఉంటుందని.. దాని గురించి భయపడే కన్నా.. జాగ్రత్తలు తీసుకుంటే మంచిదన్నారు.

ఇవే తరహా మాటలు కొన్ని రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ చేస్తే రాజకీయ ప్రత్యర్థులు మొదలు ఆయా రంగాలకు చెందిన వారు మహా ఎటకారం చేసేశారు. స్వయం మేధావి ఇమేజ్ ఉన్న కేసీఆర్ సారు లాంటి పెద్ద మనిషి నోటి నుంచి జగన్ చెప్పిన మాటలే రావడంతో ఏపీ సీఎంపై అదే పనిగా ఆడిపోసుకునే వారి నోటికి తాళం పడినట్లే. కరోనాతో జీవినం తప్పదన్న కేసీఆర్ మాటతో.. ఏపీ సీఎం నోటి నుంచి వచ్చిన మాటకు మరింత విలువ పెరగటం ఖాయం. ఇంతకాలం జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఎటకారం చేసిన వారు.. తాజా పరిణామాల నేపథ్యంలో సైలెంట్ అయ్యారు.

Loading...