Saturday, April 20, 2024
- Advertisement -

ఈ విజయం ప్రభంజనం.. ప్రజలకు కృతజ్ఞతలు : కేసీఆర్

- Advertisement -

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసిన అవేం పట్టించుకోకుండా నిర్దేశించుకునే లక్ష్యం వైపు నడవండి అని తాజా ఫలితాల ద్వారా ప్రజలు స్పష్టం చేశారని అన్నారు. ఇంత మంచి విజయంను అదించిన ప్రజలకు వ్యక్తిగతంగా, పార్టీ పక్షాన శిరసు వంచి కృతజ్ఞతలు చెబుతున్నానని కేసీఆర్ అన్నారు.

తెలంగాణ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. 2018లో శాసనసభ రద్దు చేసినప్పుడు అనేక అనుమానాలు వినిపించాయి. కానీ వాటిని పటాపంచలు చేస్తూ 88 స్థానాల్లో గెలిచాం. పార్లమెంటు ఎన్నికల్లోనూ తమకే మెజారిటీ స్థానాలు వచ్చాయన్నారు. ఆ తర్వాత 32 జెడ్పీటీసీలను గెలవడం ఆలిండియా రికార్డు అని అన్నారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేశామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ముక్త కంఠంతో తీర్పు చెప్పారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్టీఆర్,ఇందిరా హయాంలోనూ ఇలాంటి ప్రభంజనం చూడలేదన్నారు.

ఇక నిరంతరం మొరిగే కుక్కలు కొన్ని ఉన్నాయని.. ఇష్టానుసారం విమర్శలు చేస్తారని.. ముక్కు కోస్తా అంటూ వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్నారని ఇకపై వ్యక్తిగత విమర్శలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాజా మున్సిపల్ ఎన్నికల్లో తాను ఎక్కడా ఒక్క మాట మాట్లాడలేదని.. అయిన సరే మా పట్ల ప్రజలకు నమ్మకం ఉండి మంచి విజయం అందించారని అన్నారు. ఎన్నికల ఖర్చు విషయంలోనూ పార్టీ తరుపున రూ.80లక్షలు తప్ప అంతకుమించి ఖర్చు చేయలేదని కేసీఆర్ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -