Friday, April 26, 2024
- Advertisement -

వారిని కరోనా పట్టుకోవాలి.. శాపం పెట్టేసిన కేసీఆర్

- Advertisement -

ప్రపంచం మొత్తం కరోనా భయంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆయన కొన్ని దేశాల్లో మరణాలు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కొందరు దుర్మార్గులు.. ముర్ఖులు సోషల్ మీడియా వేధికగా చిల్లర ప్రచారానికి తెరతీస్తూ ప్రజల్ని మానసికంగా హింసిస్తున్నారని.. వారు తగిన ప్రతి ఫలం అనుభవించి తీరుతారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించారు.

ప్రజల మనోభావాలతో ఆడుకోవటం.. ప్రశాంతంగా ఉన్న ప్రజల్ని మానసికంగా హింసించటం మంచి పద్దతి కాదన్నారు. మేము గొప్పవాళ్లం, మమ్మల్ని ఎవరూ పట్టుకోలేరన్న గర్వంతో కొందరు మూర్ఖులు పెట్రేగిపోతున్నారని, ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచం, దేశం ఆగం అవుతున్న సమయంలో వారి చిల్లర ప్రచారాలు న్యాయమేనా అని ప్రశ్నించారు. తమనెవరూ ఏమీ చేయలేరేమనుకుంటున్నారుగాని, వారు అంతకు అంత అనుభవించేలా నేను చేసి చూపిస్తానని హెచ్చరించారు.

ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తారో.. వారిని కరోనా పట్టుకోవాలని తాను శాపం పెడుతున్నట్లు చెప్పారు. ఇక కేసీఆర్ పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఎం అంటే ఇలానే ఉండాలని.. ప్రజలకు ఏ సమస్య వచ్చిన వెంటనే స్పందించి అన్ని రకలుగా ఆదుకుంటున్నారని అంటున్నారు. ముఖ్యంగా రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా వారు పండించిన ప్రతిది ప్రభుత్వమే కొటుందని భరోసా ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -