Friday, April 19, 2024
- Advertisement -

బ్రేకింగ్.. సీఎం రమేష్ తో విజయసాయి.. ఏం జరుగుతోంది.?

- Advertisement -

ఉప్పు నిప్పులు కలిశాయి.. చర్చించాయి. చరిత్రలో చూడని కలయిక ఇదీ.. చంద్రబాబు ఆర్థికంగా.. మానసికంగా చాలా దగ్గరైన అనుయాయుడు సీఎం రమేశ్.. టీడీపీ సిద్ధాంతాలను నరనరాన జీర్ణించుకున్న ఈయన చంద్రబాబు అంటే ప్రాణమిస్తాడు. అధికారంలో ఉన్నప్పుడు బాబు కూడా ఈయనకు ఇతోదికంగా సాయం చేశాడని వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పుడు అధికారం పోయినా చంద్రబాబు వెంటే సీఎం రమేష్ ఉన్నారు.

ఇక వైఎస్ జగన్ తోపాటు జైలుకు వెళ్లి.. ఇప్పుడు వైసీపీలో తెరవెనుక అన్నీ చూసుకునే కీలక స్థానంలో విజయసాయిరెడ్డి ఉన్నారు. ఈయన జగన్ కు నమ్మినబంటు..

అయితే లోక్ సభ సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా సోమవారం సీఎం రమేష్, విజయసాయిరెడ్డిలు కలిశారు. వీరిద్దరూ మంతనాలు కూడా జరుపుకోవడం రాజకీయంగా అత్యంత ఆసక్తి కలిగించింది. వీరిద్దరూ పక్కపక్కనే కూర్చొని లోక్ సభ సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని తిలకరించారు. తెలుగు రాష్ట్రాల ఎంపీల ప్రమాణాలకు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.

అయితే అస్సలు పడని ఈ ఇద్దరు పక్కపక్కనే కూర్చొని దాదాపు గంటన్నర సేపు సన్నిహితంగా మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది. అయితే మీడియా ఎదుట మాత్రం వీరిద్దరూ ఏం మాట్లాడరనేది ఇద్దరూ వెల్లడించలేదు. విజయసాయిరెడ్డి మాత్రం ‘మీ హయాంలో చేసిన పనులు చెప్పాలని ’ సీఎం రమేష్ ను కోరానని తప్పించుకునే ప్రయత్నం చేశారు..

ఇలా రాజకీయ వైరుధ్యం గల నేతలిద్దరూ కలవడం.. పక్కపక్కన కూర్చోవడం.. చర్చలు జరపడం చూశాక.. సీఎం రమేష్ టీడీపీని వీడుతాడా? లేక యథాలాపమైన మీటింగా అన్నది ఆసక్తి రేపుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -